Tax Evasion IT Raids on Jaya Media Offices | జయలలిత మీడియా సంస్థలపై ఐటీ దాడులు.. దినకరన్, శశికళ ఇళ్లలో కూడా...

It raid on jaya tv offices in chennai

Chennai Tax Raids, Jaya TV Channel, Jaya Media, Jayalalithaa, Sasikala Dinakaran IT Raids, Tax Raids, Jaya TV Office

Tax Raids At Office Of Jaya TV, Controlled By Sasikala Family, In Chennai. Around 10 officials of the income tax investigation department entered the office of the TV channel in Chennai around 6am.

చెన్నైలో ఐటీ దాడుల కలకలం

Posted: 11/09/2017 09:04 AM IST
It raid on jaya tv offices in chennai

చెన్నైలోని అన్నాడీఎంకేకు చెందిన మీడియా సంస్థలపై ఆదాయ పన్నుల శాఖ అధికారులు గురువారం ఉదయం సోదాలు చేపట్టారు. ఎక్కత్తుతంగల్‌లోని జయ టీవీ చానల్ కార్యాలయంలోకి గురువారం తెల్లవారుజామున 6 గంటలకు చేరుకున్న పదిమంది ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆదాయపన్ను ఎగవేతకు సంబంధించి కచ్చితమైన సమాచారంతోనే తనిఖీలకు దిగినట్టు అధికారులు తెలిపారు.

టీవీ చానల్ తో పాటు ఎంజీఆర్ దిన పత్రిక కార్యాలయం, జాజ్ సినిమా కార్యాలయం ఇలా మొత్తం 100 ప్రాంతాల్లో విస్తృతంగా తనీఖీలు చేశారు. గత కొంత కాలంగా సీనియర్ అధికారుల కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సీనియర్ ఐటీ అధికారి ఒకరు పేర్కొన్నారు. జయ టీవీని జయలలిత ప్రారంభించినప్పటికీ ఇటీవల జైలుపాలైన అన్నాడీఎంకే నేత శశికళ కుటుంబ సభ్యుల నియంత్రణలో ఉంది. శశికళ మేనల్లుడు వివేక్ జయరామ్ ఇప్పుడు టీవీ బాధ్యతలను చూస్తున్నారు.

ఈ ఆగస్టులో అన్నాడీఎంకే ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు చానల్ నిర్వహణ కష్టమైంది. కాగా, జయ టీవీ కార్యాలయంపై దాడులు నిర్వహించిన అధికారులు తర్వాత వివేక్ తోపాటు దినకరన్, శశికళ ఇళ్లతోపాటు వారి కుటుంబ సభ్యులకు చెందిన వారి ఇళ్లపైనా ఐటీ దాడులు నిర్వహించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles