devottes throng to temples on kartheeka poornima హరిహరుల నామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు..

Devottes throng to temples on auspicuous kartheeka poornima day

karthika purnami, kartheeks poornima, kartheeka full moon day, karthika poornima, lord maha shiva, lord maha shiva, temples, hindu, devotees

As per Hinduism, devotees belive kartheeka poornima day as auspicious and perform special poojas to lord shanker and lord maha vishnu.

తెలుగు రాష్ట్రాలో కార్తీక శోభ.. ధ్వనిస్తున్న శివనామస్మరణ

Posted: 11/04/2017 09:23 AM IST
Devottes throng to temples on auspicuous kartheeka poornima day

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని అలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. పౌర్ణమి సందర్భంగా హరిహరులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో మహిళా భక్తులు కార్తీక దీపోత్సవం సంబరాలను జరుపుకుంటున్నారు. ఉసిరి-తులసి చెట్లను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసి అక్కడ దీపాలను వెలిగిస్తున్నారు. పంచారామ క్షేత్రాలతో పాటు అన్ని శైవక్షేత్రాల్లోనూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

వేములవాడ రాజన దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించి.. మొక్కులు  చెల్లించుకుంటున్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని.. స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని శివాలయాలు హరహర మహదేవ నామస్మరణతో మార్మోగుతున్నాయి. పరమశివుడికి భక్తులు వేకువ జామునుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. సంవత్సరం అంతా దీపారాధన చేయలేనివారు.. 365 దీపాలు వెలిగించారు. దీపాల కాంతుల్లో ఆలయాలు వెలిగిపోయాయి. కార్తీక పౌర్ణమికి ఒకరోజు ముందే కీసరగుట్ట రామలింగేశ్వరాలయంలో భక్తుల సందడి కనిపించింది. గుట్టపై ఉన్న రామలింగేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు భక్తులు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. పౌర్ణమికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles