Case filed against Kamal Haasan over 'Hindu terror' remark కమల్ పై కేసు.. విలక్షణ నటుడి మద్దతు

Prakash raj supports kamal haasan s views on hindu extremism

kamal hassan, Achanta Sharath Kamal, Cow slaughter, Extremism, Hindus, Muslims, Prakash Raj, Religion, Terrorism, hindu terrorism, cases, kollywood, politics, tamilnadu

Actor-filmmaker Prakash Raj supported actor Kamal Haasan's views on "Hindu extremists". "If instilling fear in the name of religion...culture...morality is not terrorising...then what is it. Just asking," tweeted Prakash Raj.

కమల్ పై కేసు.. విలక్షణ నటుడి మద్దతు

Posted: 11/04/2017 10:05 AM IST
Prakash raj supports kamal haasan s views on hindu extremism

'హిందూ ఉగ్ర‌వాదం' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన విలక్షణ సినీ నటుడు కమలహాసన్ పై దేశంలోని అనేక హిందూ సంస్థలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వున్నారు. కమల్ హాసన్ రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఉద్దేశం ఉంటే మంచి ప‌నులు చేసి రావాల‌ని, ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్య‌లు చేసి వార్తల్లో నిల‌వాల‌ని చూడ‌కూడ‌ద‌ని అని సూచిస్తున్నారు. దీంతో ఆయ‌న‌పై ప‌లు సెక్ష‌న్‌ల కింద కేసులు న‌మోదు చేశారు. ఒక మ‌తాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు సెక్షన్‌ 500 కింద కేసు న‌మోదు చేశారు.

అలాగే 511 సెక్ష‌న్‌ కింద నేరాలకు పూనుకోవడం, సెక్షన్‌ 298 కింద పరుష వ్యాఖ్యలతో మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, సెక్షన్‌ 295(ఏ) కింద మత విశ్వాసాలను కించపరచడం, మత భావాలను దెబ్బతీయడం, సెక్షన్‌ 505(సీ) కింద ఒక వర్గంపైన, మతంపైన దాడులు చేసేలా మాట్లాడ‌డం వంటి అభియోగాలపై కమలహాసన్ కేసుల్లో ఇరుక్కున్నాడు. రేపు ఈ కేసుల‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. కాగా, క‌మ‌ల హాస‌న్ ఈ నెల 7న త‌న అభిమానుల‌తో క‌లిసి పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్నారు. ఆ రోజున కొత్త పార్టీపై క‌మ‌ల్ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని కొంద‌రు భావిస్తున్నారు.   

కాగా కమల్ హాసన్ వ్యాఖ్యలతో మరో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సమర్ధించాడు. ‘సత్యమేవ జయతే’ నినాదంపై హిందువులు విశ్వాసాన్ని కోల్పోతున్నారని, దానికి బదులు శక్తిసంపన్నులుగా ఉండటమే సరైనదని భావిస్తున్నారని కమల్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ సమర్థించాడు. ఈ నేపథ్యంలో కమల్ ను విమర్శించే బీజేపి నేతల సంఖ్య, హిందూ సంస్థల ప్రతినిధుల సంఖ్య తక్కువేం లేకుండా పోయింది. కమల్‌ మానసిక పరిస్థితి సరిగ్గాలేదని ఎద్దేవా చేశారు. కానీ కమల్ కు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు లభించింది.

‘జాతి, మతం, నైతికత పేరుతో భయపెడితే తీవ్రవాదం కాదు. మరి దాన్ని ఏమంటారు?.. కేవలం అడుగుతున్నాను’ అని ప్రకాష్‌ రాజ్ ఈ మేరకు తన ట్వీట్టర్ అకౌంట్ ద్వారా ప్రశ్నించారు. దీంతోపాటు ‘నైతికత పేరుతో నా దేశంలోని ఓ జంటను వేధించి, శారీరకంగా చిత్రహింసకు గురి చేయడం తీవ్రవాదం కాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గోవధ చేశారనే చిన్న అనుమానంతో శిక్షించడం తీవ్రవాదం కాదు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరిచినంత మాత్రాన వారిని విమర్శించడం, తిట్టిపోయడం తీవ్రవాదం కాదు.. మరి తీవ్రవాదం అంటే ఏంటి’ అని ప్రకాష్ రాజ్ ఓ పోస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  prakash raj  hindu terrorism  cases  kollywood  politics  tamilnadu  

Other Articles