Racist Edison campaign flier evokes Trumpian style అగ్రరాజ్యంలో మళ్లి ఎగిసిన జాతి విద్వేషం..

Racist campaign mailers attack two asian school board candidates in new jersey

Asian-American school board candidates, edison, Falguni Patel, jerry shi, Make Edison Great Again, New Jersey, Indians in New Jersey, Trump's USA, Make America Great Again, Donald Trump, Trump, Indian Americans

A racist campaign mailers that attack two Asian school board candidates demanding to 'Make Edison Great Again' have been circulating in a New Jersey town.

అగ్రరాజ్యంలో మళ్లి ఎగిసిన జాతి విద్వేషం..

Posted: 11/04/2017 08:21 AM IST
Racist campaign mailers attack two asian school board candidates in new jersey

అమెరికాలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తరువాత అగ్రరాజ్యంలో జాతి వైషమ్యాలు తారాస్థాయికి చేరాయనడంలో సందేహాలు లేవు. ఇప్పటికే ఎందరో భారత సంతతికి చెందిన వ్యక్తులను విద్వేషాల నేపథ్యంలో అక్కడి వారు నిర్థాక్షిణ్యంగా హతమార్చిన ఘటనలు ఇప్పటికే అనేకం వెలుగుచూశాయి. భారత్ విదేశాంగ వ్యవహరాల శాఖ జోక్యంతో గత కొంతకాలంగా సద్దుమణిగిన వైషమ్యాలు మరోసారి పెల్లుబికింది.

భారతీయులు, చైనీయులు తమ నగరాన్ని ఆక్రమించుకుంటున్నారని, జరిగింది చాలు.. ఇకనైనా తమ నగరాన్ని వదిలేయాలనే సారాంశంతో న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో కరపత్రాలు దర్శనమిచ్చాయి. ఏసియన్‌-అమెరికన్ స్కూల్ బోర్డు సభ్యులుగా ఉన్న ఇండో అమెరికన్ ఫాల్గుణి పటేల్‌, చైనీస్‌ అమెరికన్ జెర్రీ షీలను టార్గెట్ చేస్తూ, వారిని బహిష్కరించాలని ఈ కరపత్రాల్లో పేర్కొన్నారు. ‘ఎడిసన్ నగరాన్ని మరోసారి గొప్పగా మారుద్దాం’ శీర్షికతో కరపత్రాలు కనిపించాయి.

ఈ పేరుతో వారు స్థానిక న్యూజెర్సీలోని ఎడిషన్ లో భారీ ర్యాలీని నిర్వహించారు. కాగా ఈ ర్యాలీ గురించి తెలిసిన భారతీయులు, చైనీయులు, మిడిల్ ఈస్ట్, యూరోప్ దేశస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఏవైనా దాడులు జరుగుతాయోమోనన్న భయం వారిని వెంటాడుతోంది. అయితే అక్కడున్న మనవారి భద్రత విషయంలో భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అమెరికా అధికారులతో చర్చించాలని కూడా వినతులు తెరపైడి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles