ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు.. అయ్యో పాపం పసివాడు.. ఈ పాట ఎన్టీయార్ తరువాత ఎందరెందరో ప్రేమికులు తమకు తాము అన్వయించుకుని ఆయా సరిస్థితల నుంచి గట్టెక్కుతుంటారు. ఇక గట్టెక్కలేని ప్రేమికులు ఆ పాటను కూడా పాడుకోవడం, గతం తాలుకు జ్ఞాపకాలను తలుచుకునేందుకు కూడా ఇష్టపడరు. అయితే తాజాగా హన్మకొండ యువకుడు మాత్రం ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడ్డాడు. అదీ కర్తవ్యానికి మారుపేరుగా నిలిచే పోలీసుల చేతుల్లోంచి.. ఇది విచిత్రమే కదా.
తన ప్రియురాలు ఫోన్ చేసి.. ఓ కోరిక కోరింది. ఆమె కోరికను తర్చేందుకు పనిగట్టుకుని వెళ్లిన ఓ యువకుడు అర్థరాత్రి పోలీసులకు చిక్కాడు. తృటిలో అతని ప్రాణాలతో పాటు హాస్టల్ లోని విద్యార్థులు కూడా తప్పించుకున్నారు. అసలేం జరిగిందంటే.. తన ప్రియురాలు కోరిందని తన స్నేహితులను వెంటబెట్టుకుని అమె నివసించే హాస్టల్ కాలేజీకి వచ్చిన ప్రియుడు.. అమెకు బిర్యాని. బిస్కట్లును తీసుకువచ్చాడు. అమెకు అందజేసే వీలులేకపోవడంతో.. అమెకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. దీంతో ఐడియా తట్టిన యువకుడు తన ప్రిపయురాలి ఫ్రెండ్స్ చున్నీలన్ని తాడులా పేని కిందకు వదలాలని చెప్పాడు.
అలాగే చేసిన యువతులు ఆ చున్నీల తాడుకు బిర్యానీ పాకెట్ ను యువకుడు కట్టాడు. దీన్ని పైకి లాగుతున్న సమయంలో మధ్యలో ఉన్న రెండు కరెంటు తీగలకు తగులుకుని షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు లేచి, పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వారంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పారిపోబోతున్న యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, ఎటువంటి ప్రమాదమూ జరగకపోవడంతో అబ్బాయిలను, అమ్మాయిలనూ హెచ్చరించి వదిలేసినట్టు పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jun 25 | ‘పుష్ప’ సినిమాతో పాటు ఇప్పటికే పలు సినిమాల్లోనూ పోలీసుల కళ్లు గప్పి అక్రమార్గాలల్లో ఎలా సరుకు రవాణా చేయాలో అన్నది ఒక్కో దర్శకుడు ఒక్కో వినూత్న మార్గాన్ని చూపించారు. అయితే ఆ మార్గాలను అన్వయించుకుని,... Read more
Jun 25 | పామును తేలిగ్గా పట్టుకోవచ్చునని అనుకుంటారు కొందరు. స్నేక్ ఫ్ఱెండ్స్ లేదా స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకోవడం చూసి ఓస్ ఇంతేనా.. అని అనుకునేవారు.. తామేం తక్కువ అని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాటిని పట్టుకోవడం... Read more
Jun 25 | తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులు తమ విధులకుహాజరుకాకుండా.. ఆయా స్థానాల్లో ఎవరో ఒకర్ని తమలా నటింపజేస్తూ.. వారు మాత్రం తమ... Read more
Jun 25 | విధి అడే వింత నాటకంలో అందరం పావులమే. అయితే.. ఎవరి ఆట ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఇది ముమ్మాటికీ నిజమని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తాం. అయితే నిజమని... Read more
Jun 25 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ అటు శివసేన పార్టీ అనుకూల, ప్రతికూల వర్గాలతో పార్టీ నిట్టనీలువునా రెండుగా చీలిపోతోంది. ఇంతకాలం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే అంటే మహారాష్ట్రవాసుల్లో ఉన్న భక్తి, అయన... Read more