Meghalaya CM yet to register for Aadhaar ‘‘నేనే అధార్ కార్డు తీసుకోలేదు’’

Meghalaya cm mukul sangma says he shares the concerns of his people

India, Nation, Meghalaya, Mukul Sangma, Assam, Aadhaar, union government, PM Modi, Right to Privacy, Nation News

Meghalaya Chief Minister Mukul Sangma told that he had not registered for an Aadhaar card yet. And said he shared his people’s concern about their right to privacy,

అధార్.. వ్యక్తిగత ఏకాంతానికి భంగం: సీఎం

Posted: 11/02/2017 04:07 PM IST
Meghalaya cm mukul sangma says he shares the concerns of his people

దేశంలోని ప్రజలందరికీ అన్ని పథకాలకు అన్ని అవసరాలకు కావాల్సిన అధార్ కార్డు అత్యంత అవసరమని ఓ వైపు దేశ ప్రజలను కేంద్రం జాగృతం చేస్తూండగా, మరోవైపు నిరాధారంగా వుండగమే తనకు అత్యంత ఇష్టమని, ఏకాంతానికి భంగం కలగేలా చర్యలు తీసుకోవడం తనకు ఇష్టం లేదని ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజ‌ల వ్యక్తిగ‌త ఏకాంతానికి భంగం క‌లిగించే ఆధార్‌కి ఇంకా తాను న‌మోదు చేసుకోలేద‌ని మేఘాల‌యా ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా తెలిపారు.

తానే ఇంకా అధార్ నెంబరు కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని ఇది వ్యక్తిగత భద్రతకు విఘాతం కల్గిస్తుందని అన్నాడు. ఇక తన రాష్ట్ర ప్రజ‌ల ఏకాంతం గురించి కూడా తాను ఆలోచించాల్సిన అవసరముందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగ‌త ఏకాంతం అనేది చాలా ముఖ్యమని అలాంటి ఏకాంతానికి భంగం వాటిల్లినప్పుడు ప్రజాస్వామ్యానికే అర్థం లేదని అన్నారు. ఈ విషయంలో తాను అస్సాం ముఖ్యమంత్రి స‌ర్బానంద సోనోవాల్ తో క‌లిసి ప్రభుత్వానికి ఓ లేఖ రాసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

ఆధార్ విష‌యంలో తామిద్దరం స‌రైన దారిలోనే వెళ్తున్నామ‌ని ఆయన అన్నారు. ఇక ఈ విష‌యంలో త‌మ నిర్ణయం ఎప్పటికీ మార‌ద‌ని ముకుల్ సంగ్మా తెల్చి చెప్పారు. దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చితే ఈశాన్య రాష్ట్రాల ప‌రిస్థితి విభిన్నమని చెప్పిన ఆయన.. అక్రమ చొర‌బాట్లు, దేశ స‌రిహ‌ద్దులో ఉండ‌టం కార‌ణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వ్యక్తిగ‌త ఏకాంతానికి పెద్దపీట వేయాల్సిన అవ‌స‌రం ఉందని అన్నారు. ఈ మేరకు తమకు మినహాయింపు కల్పించాలని ఆయన గ‌తంలో ప్రధానికి లేఖ రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Nation  Meghalaya  Mukul Sangma  Assam  Aadhaar  union government  PM Modi  Right to Privacy  Nation News  

Other Articles