RaGa Helped My Son 'Thank You': Nirbhaya's Mother రాహుల్, ప్రియాంకలు అలా చేశారు: నిర్భయ తల్లి అశాదేవి

Raga helped my son become pilot thank you nirbhaya s mother asha devi

rahul gandhi, rahul gandhi nirbhaya, rahul gandhi nirbhaya helped brother, nirbhaya brother pilot, nirbhaya brother pilot ashadevi, Nirbhaya, Rahul Gandhi, Asha Devi, pilot, aman

The mother of Nirbhaya, who was brutally gangraped and killed on a moving bus in Delhi on December 16, 2012 that shook the entire nation, has thanked Congress vice-president Rahul Gandhi for helping her son become a pilot.

రాహుల్, ప్రియాంకలు అలా చేశారు: నిర్భయ తల్లి అశాదేవి

Posted: 11/02/2017 12:57 PM IST
Raga helped my son become pilot thank you nirbhaya s mother asha devi

ఐదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో పెనుసంచలనంగా మారిన నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన ఏకంగా అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అధికారాన్ని కూడా దూరం చేశాయనడంలో సందేహమే లేదు. ఈ ఘటనను అమకు అవకాశంగా మలుచుకున్న రాజకీయ పార్టీని రాష్ట్ర, కేం్దరం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక రోజుల పాటు అందోళనను చేపట్టి.. న్యాయం కోసం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుల పరిస్కారానికి ఫాక్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అయితే దోషులందరినీ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఒక్క బాలుడ్ని మాత్రం జువేనైల్ హోం కు తరలించిన పోలీసులు అతడి వ్యవహార తీరుపై కూడా నిఘాను పెట్టారు. తన కంటతడి మరే తల్లికీ రావొద్దని.. ఈ మేరకు కఠిన చట్టాల రూపకల్పన కోసం జరుగుతున్న ఉద్యమాల్లో  నిర్భయ తల్లి ఆశాదేవి పాలు పంచుకున్నారు. ఇలా రోజులు గడుస్తున్న కొద్ది అందరూ ఈ ఘటనను మర్చిపోయారు. ఆ తరువాత అదే ఢిల్లీలో, ఉత్తరభారతావనిలో అనేక మంది అబలలు మగమృగాళ్ల చేతుల్లో పడి తమ మాన ప్రాణాలను కొల్పోయారు. ఇక ప్రతీ ఘటనపై కూడా అక్కడి ప్రజలు, మరీ ముఖ్యంగా యువత స్పందించలేదు.

అయితే అశాదేవి ఇప్పుడు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు తన కొడుకును అలా తయారు చేశారని కృతజ్ఞతలు తెలిపారు. అమె కొడుకును అలా తయారు చేయడమంటే అర్థం కాలేదా..? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆశా దేవి తనయుడు(23) ప్రస్తుతం భారత నావికా దళంలో ఫైలట్ గా ఎంపికయ్యాడు. అందుకు రాహుల్ అందించిన ప్రోత్సాహమే కారణమంట. నిర్భయ మరణంతో కుంగిపోయిన అమె సోదరుడు చదువుల మీద దృష్టిసారించలేకపోయాడని, అయితే అదే సమయంలో రాహలు్ తన బిడ్డతో ఫోన్ ద్వారా మాట్లాడారని, సాధించాల్సింది చాలా వుందని అంటూ వెన్నతట్టి ప్రేరేపించాడని అమె చెప్పారు.

2013లో టెన్ ప్లస్ టు పరీక్షలు అయిపోగానే రాయ్‌ బరేలీలోని ఇందిరా గాంధీ రాష్ట్రీయ అర్బన్ అకాడమీలో సీటు దక్కడంతో ఆ కుటుంబం అక్కడికి మకాం మార్చింది. ఆర్మీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమైన ఆ యువకుడు.. అది కష్టతరమని భావించాడు. ఆ సమయంలో రాహుల్ సూచన మేరకు పైలెట్ శిక్షణలో చేరి లక్ష్యాన్ని సాధించాడు. ఇప్పుడు గుర్‌గ్రామ్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో చోటు దక్కింది. తమ కుమారుడు ఇప్పుడు ఈ స్థాయికి చేరాడంటే.. అందుకు రాహుల్ అందించిన ప్రోత్సాహమే కారణమని ఆశాదేవి అన్నారు. రాహుల్ మాత్రమే కాదు.. ఆయన సోదరి ప్రియాంక కూడా తమకు తరచూ ఫోన్‌ చేసి ఆరోగ్యం గురించి వాకబు చేసేదని ఆశాదేవి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirbhaya  Rahul Gandhi  Asha Devi  pilot  aman  rai bareili  thanks  congress  

Other Articles