Sudeep & Yash fall in line, pay professional tax dues శ్రీముఖాలు అందుకున్న వెంటనే స్పందించిన ప్రముఖ హీరోలు..

Sudeep yash fall in line pay professional tax dues

Sandalwood, heros, actors Sudeep, actor Yash, professional taxes, Commercial taxes department, bengaluru, karnataka

Commercial taxes department authorities are in a joyous mood. The two new icons Sudeep and Yash, in their league are setting an example by paying taxes to the government.

శ్రీముఖాలు అందుకున్న వెంటనే స్పందించిన ప్రముఖ హీరోలు..

Posted: 11/01/2017 11:01 AM IST
Sudeep yash fall in line pay professional tax dues

ప్రస్తుతం సినీ ప్రపంచంలో అగ్రహీరోగలుగా చలామణి అవుతున్న హీరోల చర్యలతో కర్ణాటక కమర్షియల్ టాక్స్ డిఫార్టుమెంటు అధికారులు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇద్దరు ప్రముఖ హీరోలు చిత్రపరిశ్రమలోని మిగతా వారికి అదర్శంగా నిలుస్తున్నారని, దీంతో ఇక చిత్ర పరిశ్రమలో వున్న బకాయిలన్నీ తీరిపోతాయని వారు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరంటే.. శాండిల్ వుడ్ సినీమా స్టార్లు సుదీప్, యాష్ లు.

వీరిద్దరూ వృత్తిపన్ను బకాయి పడ్డారని అది కూడా ఏకంగా ఏళ్లుగా బకాయి పడ్డారని గుర్తించిన కర్ణాటక రాష్ట్ర కమర్షియల్ శాఖ అధికారులు హీరోలకు శ్రీముఖాలను అందించారు. 2011 నుంచి 2017వ సంవత్సరం వరకు ప్రముఖ సినీనటుడైన సుదీప్ రూ.33 వేలు, మరో సినీనటుడు యాష్ 2010 నుంచి 2018 వరకు రూ.53వేల వృత్తిపన్ను బకాయి ఉందని ఆ మొత్తాలను చెల్లించాలని వాణిజ్యపన్నుల శాఖాధికారులు ఇటీవల వారికి నోటీసులు జారీ చేశారు.

గత నెల అక్టోబర్ లో నోటీసులు అందుకున్న హీరోలు సుదీప్, యాష్ లిద్దరూ పక్షం రోజుల వ్యవధిలో వాటిని సంబంధిత శాఖ అధికారులకు చెల్లించేశారు. యాష్ నోటీసులను అందుకున్న మరుసటి రోజునే చెల్లించగా, సుదీప్ మాత్రం సరిగ్గా నిన్న అక్టోబర్ 31 (మంగళవారం) వాటిని చెల్లించేశాడు. దీంతో కర్ణాటక వాణిజ్యపన్న శాఖ అధికారులు హీరోలు నిజ జీవితంలో కూడా అందరకీ అదర్శంగా నిలుస్తున్నారని కితాబిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles