Terrorist Truck Attack Kills Eight on New York Bike Path | న్యూయార్క్ లో ఉగ్ర దాడి.. 8 మంది మృతి

New york city truck terror attack

New York, Terrorist Truck, New York Terror Attack, Trump New York Terror Attack, New York Terrorist Attack, New York Truck Attack, New York Manhattan Terror Attack, New York Hudson Terror Attack, New York Bike Path, Sayfullo Saipov New York Attack

Suspected Terrorist Truck Attack Kills Eight on New York Bike Path. Eight dead in truck attack on New York City bike path. 'This was an act of terror,' mayor Said.Sayfullo Saipov named as suspect in New York truck attack killings.

న్యూయార్క్ లో ట్రక్కు తో ఉగ్ర దాడి

Posted: 11/01/2017 10:48 AM IST
New york city truck terror attack

అగ్ర రాజ్యం అమెరికా ఉగ్ర దాడితో ఉలిక్కి పడింది. ఓ ఉగ్రవాది ట్రక్కు సాయంతో బీభత్సం సృష్టించాడు. మాన్ హట్టన్ లోని హుడ్సన్ నది సమీపంలో పాదాచారులపై దూసుకెళ్లటంతో 8 మంది అక్కడి కక్కడే చనిపోయారు. మంగళవారం(భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం) ఈ ఘటన చోటు చేసుకుంది. 

లోయర్ మాన్‌హట్టన్‌ ప్రాంతంలో ట్రక్కును నడుపుకుంటూ వచ్చిన దుండగుడు ఒక్కసారిగా దానిని సైకిళ్లు ప్రయాణించే మార్గంలోకి మళ్లించి జనాల పైనుంచి పోనిచ్చాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్కుతో ఓ స్కూల్ బస్సును ఢీకొట్టిన అనంతరం పారిపోతున్న దుండగుడిని పోలీసుల కాల్చారు. ఆ సమయంలో అతను అల్లా హో అక్బర్ నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. గాయపడ్డ అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉజ్ బెకిస్థాన్ కు చెందిన 29 ఏళ్ల షైఫులో  సైఫోవ్ గా అతన్ని గుర్తించారు.సైపోవ్ 2010లో అమెరికాకు వలస వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దాడికి ఉపయోగించిన ట్రక్కు వద్ద అరబిక్‌లో రాసిన లేఖను గుర్తించారు. దీనిని బట్టి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో అతడికి సంబంధాలున్నట్టు తెలుస్తోందని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. ఇది ఉగ్రదాడేనని మేయర్ బిల్ డే బ్లాసియో ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ట్రక్కు దాడిపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యూయార్క్ మేయర్ దీనిని ఉగ్ర దాడిగానే ప్రకటించారు. 9/11 తర్వాత న్యూయార్క్ లో జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడి ఇదేనని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles