AP Government Reopen case against Banwar Lal | రిటైర్డ్ అయిన కొద్ది గంటల్లోనే భన్వర్ లాల్ కు చిక్కులు.. పాత కేసు ఎందుకు తిరగదోడారు?

Big shock to bhanwar lal

Andhra Pradesh, Banwar Lal, Disciplinary Action Case, Banwar Lal Troubles, Banwar Lal. Retired, Banwar Lal Old Case, Banwar La Revenge, AP CM Revenge Banwar Lal, Banwar Lal Penalty Case, Banwar Lal Case, Banwar Lal Case Re Open

Andhra Pradesh government to reopen case against IAS officer Banwar Lal.According to Memo No. 419/SC.D/A32007-6 dated August 8, 2016, the government had withdrawn the charges against Banwar Lal.Mr Lal has been charged with the misuse of power and the unauthorised use of government quarters in Banjara Hills while serving as the district collector of Hyderabad in 2006.

భన్వర్ లాల్ కు ఏపీ సర్కార్ షాక్

Posted: 11/01/2017 08:40 AM IST
Big shock to bhanwar lal

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కు షాకిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైపోతుంది. ఆయనపై ఓ పాత కేసు తిరగదోడి.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ దినేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భన్వర్‌లాల్ పదవీ విరమణ చేసిన కొన్ని గంటల్లోనే ఆయనపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించడం చర్చనీయాంశం.

వివరాల్లోకి వెళితే.. నవంబరు 1996లో భన్వర్‌లాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆయనకు బంజారాహిల్స్ రోడ్ నంబరు 13లో అధికారిక కలెక్టర్ నివాసంగా క్వార్టర్ నెంబరు
33ని కేటాయించారు. జూలై 2000లో భన్వర్‌లాల్ స్థానంలో అరవింద్ కుమార్‌ను ప్రభుత్వం కలెక్టర్‌గా నియమించింది. దీంతో భన్వర్‌లాల్ తన నివాసాన్ని ఖాళీ చేసి కొత్త అధికారికి అప్పగించాల్సి ఉంది. కానీ మే 9, 2006 వరకు భన్వర్‌లాల్ ఆ నివాసాన్ని ఖాళీ చేయకుండా అనధికారికంగా అందులో నివసించారు.

భన్వర్‌లాల్ చర్యలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం మే 3, 2005న ఆయనకు మెమో జారీ చేసింది. అయినా పట్టించుకోకపోవడంతో బలవంతంగానైనా ఖాళీ చేయించాలని ఎస్టేట్ అధికారిని ఆదేశించింది. అప్పటికీ ఆయన స్పందించకపోవడంతో బలవతంగా ఖాళీ చేయించారు. ఆపై 70 నెలలపాటు బంగళాను అనధికారికంగా వినియోగించినందుకు గాను నెలకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.17.50 లక్షలు చెల్లించాలని ఆగస్టు 24, 2005న భన్వర్‌లాల్‌కు నోటీసు పంపారు. ఆపై ఆ అపరాధ రుసుమును రూ.4.37 లక్షలకు కుదించింది. అంతేకాక నెలకు రూ.5 వేల చొప్పున 88 నెలలపాటు ఆయన వేతనం నుంచి వసూలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ రెండూ జరగలేదు.

ఆయన ట్రాక్ రికార్డ్ మూలంగా ఆ అంశాన్ని ఆ బకాయిలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 419/SC.D/A32007-6 మెమోలో ఆ అంశం స్పష్టంగా పేర్కొని ఉండగా, అప్పటి సీఎస్ సత్యప్రకాశ్ థక్కర్ ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించారు కూడా. కానీ, ఇప్పుడు ఏం జరిగిందో తెలీదుగానీ ఆ అంశం మళ్లీ తెరపైకి తీసుకొచ్చి ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అయితే నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యల ఫిర్యాదుపై ఆలస్యంగా స్పందించిన కారణంగానే ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందన్న వాదన ఒకటి వినిపిస్తోంది.

 

భన్వర్ లాల్ గురించి... 


అక్టోబర్ 25, 1957లో రాజస్థాన్ లో జన్మించిన భన్వర్ లాల్ ఎకనామిక్స్ లో మాస్టర్ డిగ్రీ చెయ్యగా.. యూకే బర్మింగ్ హమ్ లో ఎంబీఏ చేశారు. 1983 ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆయన కందకూరు సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ అందుకున్నారు. ఆపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా, అటుపై ప్రభుత్వంలోని పలు కీలక విభాగాల అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. పునర్విభజన తర్వాత విజయవంతంగా ఎన్నికలు నిర్వహించటంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై ప్రత్యేక ప్రశంసలు కురిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles