GoM suggests GST in MRP mandatory జర దేఖ్ కే ఖరీదో..! ఎంఆర్పీహీ నహీ, జీఎస్టీ బి..!!

Panel suggests making gst inclusion in mrp mandatory

Himanta Biswa Sarma, Assam Finance Minister, Arun jaitley pannel, Maximum retail price (MRP), goods and services tax (GST), GST Pannel, GST, MRP, GST in MRP, Indirect tax, retail sector, business

GoM has recommended that the government make it amply clear in the present GST law that MRP is the maximum price of a product to be sold in retail.

జర దేఖ్ కే ఖరీదో..! ఎంఆర్పీహీ నహీ, జీఎస్టీ బి..!!

Posted: 10/31/2017 04:27 PM IST
Panel suggests making gst inclusion in mrp mandatory

జీఎస్టీ.. వస్తు సేవా పన్ను.. ఇది అమల్లోకి రావడం ఏమో కానీ.. ఏ వస్తువుపై ఎంత మేర పన్ను పడిందన్న లెక్కలు రీటైల్ రంగంలోని వ్యాపారులకు కూడా అర్థం కావడానికి మరింత సమయం పట్టనుందనడంలో సందేహం అవసరం లేదు. కానీ.. అయ్యిందానికి, కానిదానికి జీఎస్టీ పేరు చెప్పి అందినకాడికి దోచేసుకోవడం వ్యాపారులకు కామన్ అయ్యిపోయింది. నోట్ల రద్దుతో ఏదో కాస్తో కూస్తో వున్న నల్లదనం కాస్తా పోయిందన్నుకున్న క్రమంలో జీఎస్టీ పేరుతో వ్యాపారులు అక్రమంగా డబ్బును కూడబెట్టుకుంటున్నారు.

జీఎస్టీ అమలుతో ధరలు మొత్తం తగ్గుతాయని చెప్పిన కేంద్ర అంచనాలకు వ్యాపారులు తూట్లు పోడుస్తున్నారు. బిల్లుతో పాటు జీఎస్టీ వేరుగా చూపిస్తున్నారు. ఓ వైపు కేంద్రం ధరలు తగ్గుతాయని చెబుతుంటే.. వ్యాపారులు మాత్రం అదనంగా చూపిస్తున్నారు. దీనిపై అసలు ధర ఎంతో తెలియక అయోమయానికి గురవుతున్నారు జనం. దీన్ని పరిష్కరించేందుకు అస్పోం అర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో జీఎస్టీపై ఏర్పాటు అయిన మంత్రివర్గ ఉప సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఎంఆర్పీ ధరలో జీఎస్టీని కలుపుకునే వుండాలా సంస్థలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ప్యాకేజ్ ఫుడ్ ఏదైనా సరే జీఎస్టీని కలిపే అసలు ధర ముద్రించాలని కోరింది. ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మకూడని స్పష్టం చేసింది.వస్తువు వాస్తవ ధర ఎంత, దానిపై జీఎస్టీ ఎంత అనేది ఎమ్మెర్పీ కింద వేర్వేరుగా చూపించాలని వ్యాపార సంస్థలకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మకూడదని చెప్పింది. వచ్చే నెల (నవంబర్) 10వ తేదీ జరిగే జీఎస్టీ సమావేశంలో మంత్రి వర్గం సంఘం సిఫారసును ఆమోదించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles