100-year-old dies after rape in UP సిగ్గు.. సిగ్గు.. పండు ముదుసలిపై అఘాయిత్యం..

100 year old woman dies after she was raped by drunk youth

100-year-old rape, Meerut, Rape, Meerut Rape, meerut rape case, case, Assault, Girl rape, Uttar Pradesh, IPC, crime

In a shocking incident a 100-year-old woman who was unwell died after being raped by a drunk youth in Uttar Pradesh. The Crime was reported from Jaani village in Meerut district

సిగ్గు.. సిగ్గు.. పండు ముదుసలిపై అఘాయిత్యం..

Posted: 10/31/2017 12:10 PM IST
100 year old woman dies after she was raped by drunk youth

దేశం ఎక్కడికి పోతుంది.. ఏమైపోతుంది..? నేరాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నా.. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పాకులాడుతున్నాయి. దేశంలో అడవాళ్లకు భద్రత కరువైంది. అడ అన్న విషయం తెలిస్తే చాలు.. ఏడాది చిన్నారుల నుంచి వందేళ్ల పండు ముసలిల వరకు ఎవరికీ భద్రత లేకుండా పోతుంది. బీజేపి ప్రాబల్యం అధికంగా వున్న ఉత్తర భారతావనీలో ఈ నేరాల సంఖ్య మరింత పెరుగుతూ.. యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తుంది. ఇక దీనితో పాటు కనీవిని ఎరుగని నేరాలు కూడా సామాన్యులలో అందోళన రేకెత్తిస్తున్నాయి.

నేరాలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకువస్తామని, అడపడచులకు భద్రత కల్పిస్తామని ఎన్నికల హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన బీజేపి పాలిత ఉత్తర్ ప్రదేశ్ లోని  మీరట్ లో మానవమృగాళ్లు కూడా సిగ్గుతో తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. వందేళ్ల పండు ముదుసలి వయోభారంతో తన సోదరుడి ఇంటి వద్దనే వుంటోంది. అయితే వయస్సు పైబడిన క్రమంలో కొన్నాళ్లుగా అమె అరు బయట మంచానికే పరిమితం అయ్యింది.

అదివారం ఎవరూ లేని సమయంలోఇంట్లోకి ప్రవేశించిన అంకిత్ పునియా అనే యువకుడు పీకల దాకా తాగి కామంతో కళ్లు మూసుకుపోయి పండు ముసలి అని కూడా చూడకుండా అమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. గట్టిగా అరవలేని స్థితిలో, ఆమె దీనంగా ఏడ్చిన ఏడుపులు వినబడటంతో చుట్టుపక్కలవారు స్పందించారు. ఏం జరిగిందోననే కంగారుతో తలుపులు తెరవగా, యువకుడు చేస్తున్న అకృత్యాన్ని చూసి షాకయ్యారు. వెంటనే అతణ్ని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వందేళ్ల వయస్సు, అనారోగ్య సమస్యలు, ఇలాంటి అమానవీయ ఘటన సంభవించడంతో అమె అరోగ్య పరిస్థితి మరింతగా దిజగారి తెల్లవారే సరికి అమె అనంతవాయువుల్లో కలసిపోయింది. అస్పత్రిలో చికిత్స చేయిస్తున్నా అమె దేహం ఏ మాత్రం వైద్యానికి సహకరించలేదని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అమె శరీరభాగాలను అక్నోలోని ఫోరెన్సీక్ ల్యాబ్ కు పంపారు. అత్యాచారానికి పాల్పడిన అంకిత్ పునియాపై పోలసీులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 100-year-old rape  Meerut  Rape  Assault  Girl rape  Uttar Pradesh  IPC  crime  

Other Articles