child abducted by interest merchant in nizamabad వడ్డీ కింద చిన్నారి కిడ్నాప్..

Child abducted by interest merchant in nizambad

bharathi, pawan, moti, mother, child abducted, child kidnaped, interest merchant abduct child, interest merchand kidnaped child, call money in nizambad, call money in telangana, call money in bodhan, bodhan sub collector, sikta patnaik, justice.

bharathi, a mother whose child was abducted by interest merchant in nizambad approached bodhan sub collector sikta patnaik seeking justice.

పడగ విప్పిన కాల్ మనీ కాలనాగు.. వడ్డీ కింద చిన్నారి కిడ్నాప్..

Posted: 10/31/2017 11:23 AM IST
Child abducted by interest merchant in nizambad

నిజామాబాద్ జిల్లాలో కాల్ మనీ కాలనాగులు రుణం తీసుకున్నవారిపై విషాన్ని కక్కుతున్నారు. వడ్డాసురల చేతుల్లో చిక్కనందుకు నవమాసాలు మోసి కన్న బిడ్డలను కూడా దూరం చేసుకోవాల్సిన దారుణ పరిస్థితులను ఉత్పన్నమయ్యేలా చేస్తున్నారు. అవసరం వుండి అప్పు తీసుకోవడమే పాపమైనట్లు ప్రవర్తిస్తున్నారు.

ఎప్పుడో తరాల కిందట అనాగరిక కాలంలో తాతలు, తండ్రులు చేసిన అప్పుల కింద పిల్లలు దొరలు, పటేళ్ల, సౌకారుల ఇళ్లలో (ఊడిగం) పనిచేసిన నాటి చేధు జ్ఞాపకాలను గుర్తుకు తీసుకువస్తున్న ఘటన తాజాగా నిజామాబాద్ జిల్లాలో జరిగింది. అప్పు సకాలంలో తిరిగి కట్టలేదని వడ్డాసురులు ఏకంగా చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన భారతి, మోతి దంపతులు బట్టల వ్యాపారం చేస్తున్నారు. సంవత్సరం క్రితం నారాయణ అనే వడ్డీ వ్యాపారి నుంచి రూ.70వేలు అప్పు తీసుకున్నారు.

దశలవారీగా ఇప్పటికే వడ్డీతో కలిపి 20వేల రూపాయలు చెల్లించారు. కొద్ది సమయం ఇస్తే మిగతా మొత్తం చెల్లిస్తామని చెప్పారు. అయినా నారాయణ వారి మాటలను లక్ష్యపెట్టకుండా వారి కొడుకును తీసుకెళ్లాడు. అసలు, వడ్డీ రెండు కలసి రూ. రెండు లక్షల రూపాయలను చెల్లించిన తరువాతే వారి బిడ్డ పవన్ ను తీసుకెళ్లాలని వార్నింగ్ ఇచ్చాడు. బిడ్డ దూరం కావడంతో అందోళన చెందిన భారతి, బోధన్ సబ్ కలెక్టర్ సిగ్ధ పట్నాయక్ ను కలిసి పిర్యాదు చేసింది. వడ్డీ వ్యాపారి బెదిరింపులకు భయపడి భర్త కూడా పారిపోయాడని.. న్యాయం చేయాలని వేడుకుంది. సబ్ కలెక్టర్ అదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bharathi  sikta patnaik  bodhan  pawan  interest merchant  call money  crime  

Other Articles