Revanth reddy officially joins congress రేవంత్ రెడ్డి.. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేత..

Revanth reddy officially joins congress under rahul s leadership

Revanth Reddy, Rahul Gandhi, Congress, uttham kumar reddy, v.hanmath rao, kuntia, Telangana TDP leaders, Telangana TRS leaders, TRS government, KCR, Telangana, TPCC politics

A. Revanth Reddy, who resigned from Telangana TDP and state assembly had joined All India congress party in the presense of vice president Rahul gandhi along with a team of 45 members who all quits TDP.

రేవంత్ రెడ్డి.. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేత..

Posted: 10/31/2017 01:08 PM IST
Revanth reddy officially joins congress under rahul s leadership

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్సీ మాజీ నేత అనుముల రేవంత్‌ రెడ్డి ఇవాళ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటుగా 18 మంది టీడీపీ సీనియర్ నేతలు, టీఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్వర్యంలో రేవంత్ సహా 18 మంది నేతలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించారు.

తెలంగాణ ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ అనేక ఒత్తిళ్లకు ఒర్చినా.. ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిందని ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ భావజాలాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ టీడీపీ, టీఆర్ఎస్ నేతల చేరికలు వుంటాయని ఆకాంక్షించిన ఆయన అందరినీ కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులుగా భావిస్తామని అన్నారు. అందరికీ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, నేతలు వి.హన్మంతరావు, మధుయాష్కిగౌడ్‌, గీతారెడ్డి, చిన్నారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, మల్లు రవి, కుసుమ కుమారి తదితరులు కూడా పాల్గొన్నారు.

రేవంత్ తో పాటుగా చేరిందేవరు..?

టీడీపీ నుంచి రేవంత్‌ రెడ్డి, సీతక్క, బోడ జనార్థన్‌, వేం నరేందర్‌రెడ్డి, అరికెలనర్సారెడ్డి, సోయం బాపురావు, కవ్వంపల్లి సత్యనారాయణ, సత్యం, జంగయ్య, హరిప్రియా నాయక్‌, బిల్యా నాయక్‌, శశికళ, రాజారాం యాదవ్‌, పటేల్‌ సుధాకర్‌రెడ్డి, రమేశ్‌​, విజయరమణా రావులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి దొమ్మాటి, విద్యార్థి, యువజన ఉద్యమనాయకులు దరువు ఎల్లన్న, బాలలక్ష్మి, మధుసూదన్‌లు కాంగ్రెస్‌లోకి చేరినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Rahul Gandhi  Congress  uttham kumar reddy  v.hanmath rao  kuntia  Telangana  

Other Articles