Revanth Reddy Resigns To TDP party and MLA post టీడీపీకి రేవంత్ గుడ్ బై.. ఎమ్మెల్యే పదవికి కూడా..!

Revanth reddy resigns to tdp party and mla post

Revanth Reddy, KCR, Chandrababu Naidu, TDP, Telangana TDP,Revanth resigns,TTDP, Revanth Updates,Revanth Reddy Updates, Congress, Rahul Gandhi, MLA, speaker madhusudhana charay, politics

Revanth Reddy has finally put an end to all the speculation regarding his move to quit the Telugu Desam Party. He met TDP Chief Chandrababu Naidu in Vijayawada and submitted his resignation. On October 27 he resigned to his MLA post

టీడీపీకి రేవంత్ గుడ్ బై.. ఎమ్మెల్యే పదవికి కూడా..!

Posted: 10/28/2017 02:42 PM IST
Revanth reddy resigns to tdp party and mla post

అనుకున్నట్లే జరిగింది...టీడీపీ పార్టీకి కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గుడ్‌బై చెప్పారు. నిన్న హైదరాబాద్ లోని లే్క్ వ్యూ గెస్ట్ హౌజ్ లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో అర్థాంతరంగా ముగిసిన సమావేశం.. ఇవాళ విజయవాడలో  మళ్లి కొనసాగింది. చంద్రబాబుతో భేటీ అనంతరం రేవంత్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేవంత్‌ రెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి అందచేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని, అయితే టీడీపీతో పాటు అధ‍్యక్షుడిపైనా తనకు ఎంతో గౌరవం ఉందని రేవంత్‌ తన లేఖలో పేర్కొన్నారు. పార‍్టీలో తన ఎదుగుదలకు చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. ఓ వైపు తాను టీఆర్ఎస్ తో తాను పోరాడుతుంటే తనకు మద్దతు పలకాల్సిన తన పార్టీ నేతలు.. తనకు బదులు తాను పోరాడుతున్న అధికార పార్టీకి, కేసీఆర్ కు మద్దతుగా నిలవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

రానున్న సార్వత్రిక ఎన్నికలలో టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతుందని ప్రకటనలు కూడా చేస్తున్నారని, వారిని చంద్రబాబు ఎందుకు నిలువరించలేక పోతున్నారని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక తాను టీడీపీలో కొనసాగలేనని, అందుకే టీడీపీకి రాజీనామా చేసినట్లు ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. కాగా కొడంగల్‌లో పార్టీ శ్రేణులతో మాట్లాడిన అనంతరం రేవంత్‌ తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా శుక్రవారం (అక్టోబర్ 27) రేవంత్ తన శాసనపభ్య సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ మధుసూదన్ చారీకి పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  chandrababu  TDP  Telangana  KCR  Congress  Rahul Gandhi  MLA  speaker madhusudhana charay  politics  

Other Articles