Govt working on tougher consumer protection lawతప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలకు చెల్లుచీటి

Government working on new consumer protection law pm

consumer protection, consumer protection law, Prime Minister Narendra Modi, Narendra Modi, PM Narendra Modi, PM Modi, Modi, misleading advertisements, misleading ads, redressal of grievances

A new consumer protection law is on the anvil to crack down on misleading advertisements and simplify the grievance redressal mechanism, Prime Minister Narendra Modi said

తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలకు చెల్లుచీటి

Posted: 10/27/2017 10:59 AM IST
Government working on new consumer protection law pm

ప్రేక్షకులను, వినియోగదారులను వాణిజ్య ప్రకటనల ద్వారా అకర్షించి వారికి అరచేతిలో వైకుంఠాన్ని  చూపి.. వాస్తవంలో మాత్రం ఏలాంటి రిజల్ట్ లేక బురిడీ కొట్టించే సంస్థలు అనేకం వున్నాయి. మా తేనే నూటికి 90 శాతం నిజమని బెల్లం పాకాన్ని అమ్ముతున్న సంస్థలు కూడా అగ్రశ్రేణి సంస్థలుగా దూసుకెళ్తున్నాయి. అయితే ఇలాంటి సంస్థలతో పాటు ప్రేక్షకులను తప్పదోవ పట్టించే సంస్థలపై కూడా చర్యలు తీసుకునే నూతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్దం చేస్తుంది.

దీంతో ఇక వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనకు సంస్థలు మంగళం పాడాల్సిందే. లేకపోతే.. ఆ సంస్థలకు శరాఘాతం తప్పడమేకాదు.. చేతి చమురు కూడా వదులుతుంది. ఇప్పటివరకు టీవీల్లో పావుగంట నుంచి అరగంట వరకు కమర్షియల్ బ్రేక్ స్లాట్ తీసుకుని వస్తున్న వాణిజ్య ప్రకటనలకు కూడా ఇక బ్రేక్ పడనుంది. ఎందుకంటే ఇకపై తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్టు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.

వినియోగదారులను తప్పుదోవ పట్టించే సంస్థలపై రూ.50 లక్షల జరిమానాతోపాటు వాటిపై మూడేళ్ల నిషేధం విధించనున్నామని కూడా ప్రకటించారు. ఇక అవసరమైతే  జైలు శిక్ష కూడా విధించనున్నామని చెప్పారు. గత మూడేళ్లుగా రూపుదిద్దుకున్న ఈ నూతన చట్టం.. కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం త్వరలో వస్తుందని, ఆ తరువాత శీతాకాల సమావేశాల్లో ఈ చట్టం పార్లమెంటు ఉభయ సభల ముందుకు కూడా రానుందని మోడీ చెప్పారు.

అంతర్జాతీయ కన్జూమర్ ప్రొటెక్షన్ కాన్ఫరెన్స్ కు హాజరైన ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు. మూడేళ్లుగా రూపకల్పన చేస్తున్న ఈ చట్టాన్ని శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని తెలిపారు. వినియోగదారుల సాధికారతకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మోసపోయిన వినియోగదారులకు త్వరితగతిన పరిహారం అందించేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వినియోదారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రధాని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles