ycp party boycotts AP assembly sessions ప్రతిపక్షమే బహిష్కరించింది.. ఎన్టీయారే అదర్శమంది..

Ysrcp party boycotts andhra pradesh assembly sessions

YS Jagan, YSRCP, AP Assembly, Assembly sessions, YCP Leaders , Sr Leaders, defeted mlas, peddi reddi ramachandra reddy, Andhra pradesh assembly sessions, Oppositon Leaders, kodela shiva prasada rao, andhra pradesh, politics

ysrcp legislative party had decided to boycott Andhra pradesh assembly sessions untill speaker kodela shiva prasada rao takes decision on defeted mlas.

ప్రతిపక్షమే బహిష్కరించింది.. ఎన్టీయారే అదర్శమంది..

Posted: 10/26/2017 12:46 PM IST
Ysrcp party boycotts andhra pradesh assembly sessions

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అధికార పక్షం అసెంబ్లీలో తమ వాదనలను ఎలాంటి అటంకాలు లేకుండా నిర్వహించుకునే అవకాశాన్ని తాము కల్పిస్తున్నామని వైసీపీ ప్రకటించింది. అడిగినా మైక్ ఇవ్వని అధికార పక్షం వైఖరి.. తమ వాదనలను పూర్తిగా ప్రజలకు చేరకుండా కేవలం వివాదాస్పందంగా మారేవి మాత్రమే ప్రజల్లోకి విడుదల చేసి.. తమను తమ పార్టీని, పార్టీ నేతలను అబాసుపాలు చేసేందుకు ఇక అధికారపక్షం ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదనే సందేశాన్ని పంపింది ప్రధాన ప్రతిపక్షం.

అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ ఎందుకు..?

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అధికార పక్షం ప్రలోభాలకు గురిచేసి.. ప్యాకేజీలు ప్రకటించి తమ పార్టీలోకి వచ్చేలా ఫిరాయించుకుందని ఇప్పటికే అరోపించిన వైసీపీ.. వారిపై చర్యలు తీసుకోవాలని గత మూడేళ్లుగా స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కోరుతున్నా పెడచెవిన పెట్టడమే ఇందుకు మూల కారణమని అరోపిస్తుంది. ఇప్పటికైనా స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామంటేనా అసెంబ్లీలో అడుగుపెడతామని స్పష్టం చేసిన వైసీపా.. అప్పటివరకు తమ నిరసన కోనసాగుతుందని అన్ని సెషన్స్ ను బహిష్కరిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు పట్టుఎందుకు..?

తమ పార్టీ బీఫారమ్ తీసుకుని ఫ్యాన్ గుర్తుతో గెలిచి.. అక్రమంగా, అన్యాయంగా అధికార పార్టీలోకి చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లినా.. ఫలితం లేకుండా పోయిందని, ప్రజాస్వామ్యాన్ని స్పీకర్ కొడెల అపహాస్యం చేస్తున్నారని పెద్దిరెడ్డి అరోపించారు. అసెంబ్లీలో తమ పార్టీ నేతలు అడిగిన ప్రశ్నలకు మంత్రుల హోదాలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమకు సమాధానాలు చెబుతున్నారని, ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు.

ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకుని వారందరిపై వేటు వేస్తే తప్ప తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరుకామని ఈ మేరకు తమ పార్టీ నిర్ణయం తీసుకుందని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఫార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యను కోరుతూ టీడీపీ వ్యవస్థాపక అద్యక్షుడు నందమూరి ఎన్టీ రామారావు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని.. ఆయనే ఇప్పటి తమ అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు అదర్శమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles