revanth reddy slams ap tdp leaders ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ ఫైర్.. కాంగ్రెస్ తో కలిసే..

Revanth reddy slams andhra pradesh tdp leaders

Revanth Reddy, Congress Speculations, revanth reddy slams ap tdp leaders, revanth reddy fires ap tdp leaders, yanamala ramakrishnudu, paritala sunita, payyaula keshav, Revanth Reddy Congress Working President, Revanth Reddy Delhi Tour, Revanth Reddy Denies Rumours, Revanth Reddy TRS Ministers Coolie, Revanth Reddy Complaint Election Commission

Telangana Tdp working president Revanth Reddy slams andhra pradesh tdp leaders, asks what favour they has towards CM KCR, who kept them behind bars.

ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ ఫైర్.. కాంగ్రెస్ తో కలిసే..

Posted: 10/18/2017 03:37 PM IST
Revanth reddy slams andhra pradesh tdp leaders

టీడీపీ పార్టీ కోసం తాను తుది వరకు పోరాడతానని చెప్పిన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి.. తెలంగాణలో టీడీపీ పార్టీయే కనుమరుగు అవుతున్నా ఇంకా అందులోనే కోనసాగుతూ.. తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తనపై రాష్ట్ర ప్రభుత్వం పలు కేసులు నమోదు చేయించి జైలుకు పంపించినా.. వెన్ను చూపని రేవంత్.. యోధుడిలా బైయిల్ పై బయటకు వచ్చారు. అయితే తాను ఎంతగానో నమ్మకున్న పార్టీ కోసం ఎంతవరకైనా తెగిస్తానన్న ఆయన మాటలు.. ఇక రానున్న ఎన్నికలలో ఇద్దరు చంద్రులు ఏకమై తెలంగాణలో పోటీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో రేవంత్ క్రితం రోజున ఢిల్లీలో రాహుల్ గాంధీని కలసి వచ్చారు.

అంతే ఆ వార్త గుప్పుమంటూ పోక్కడంతో.. ఇక రేవంత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తనపై వచ్చిన వార్తలను ఖండిస్తూ వచ్చిన రేవంత్.. ఇవాళ మీడియా ముందు తనలోని భాధను వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ ఉనికిని చాటడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్న క్రమంలో తాము కేసీఆర్ ప్రభుత్వంతో ఎడతెరపి లేని పోరాటం సల్పుతున్న క్రమంలో ఏపీలోని టీడీపీ నేతలు కేసీఆర్ కు వంగి, వంగి దండాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నేతలపై కూడా ఆయన పలు అరోపణలు చేశారు.

తెలంగాణలో ఏపీ మంత్రులకు అసలు పనేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీ మంత్రి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడరని అరోపించారు. తన అరోపణలు నిజం కాదా..? అని ఆయన యనమలకు సవాల్ విసిరారు. అందుకనే యనమల రామకృష్ణుడు కేసీఆర్ పై ఈగ కూడా వాలనీయరని చెప్పుకోచ్చారు. ఇక మరో మంత్రి పరిటాల సునీత కుటింబికులకు హైదరాబాద్ లో బీర్ల కంపెనీకి లైసెన్సులు ఎలా వచ్చాయని రేవంత్ నిలదీశారు.

పరిటాల సునీత కుమారిడితో పాటు పయ్యావుల అల్లుడు కలసి ఈ బీర్ల కంపెనీని నడుపతున్నారని రేవంత్ అరోపించారు. ఇక తాను పయ్యావుల కేశవ్ ను దూషించానన్న అరోపణలపై స్పందించిన రేవంత్.. పయ్యావుల ను ప్రజలు తిరస్కరించారని, ఇక ఆయనను తాను తిట్టాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలసి అనేక ఉద్యమాలు చేశామని, ఇలా చేసిన అనేక మంది నేతలు టీడీపీలో మంత్రులు కూడా అయ్యారని ఆయన చెప్పారు. తెలంగాణలో అసలు రాజకీయ పార్టీలు అన్నవే లేవని, ఉన్నదల్లా కేవలం కేసీఆర్ కూటమి, కేసీఆర్ వ్యతిరేక కూటమేనని రేవంత్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  AP TDP leaders  allegation  Yanamala  parital sunita  chandrababu  congress  

Other Articles