Police Investigating Alleged Terror Plot to Kill CM సీఎం హత్యకు కుట్ర.. అకతాయి పనా..? లేక నిజమా..?

Police investigating alleged terror plot to kill cm

Berhampore Police Station, Kolkata police, Mamata Banerjee, West Bengal chief Minister, Polytechnic student, terror group, terror recruiter, Terror Plot, terrorism, Whatsapp, crime

A Polytechnic student received a WhatsApp message asking him to join a terror group. When the student replied that he was not interested, the alleged terror recruiter replied, “We have a contract to kill the CM.”

సీఎం హత్యకు కుట్ర.. అకతాయి పనా..? లేక నిజమా..?

Posted: 10/18/2017 04:17 PM IST
Police investigating alleged terror plot to kill cm

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని హత్యకు నిజంగానే ఉగ్రవాద మూకలు పథక రచన చేస్తున్నాయా.? అసలు అమెనే తమ టార్గెట్ గా ఎంచుకునేందుకు కారణమేంటి. అమెపై ఉగ్రవాదులు గురి ఎందుకు పెట్టారు..? ముష్కర మూకలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకుంటున్న క్రమంలో అదే పేరుతో అమె వ్యతిరేక వర్గాలు ఇలా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయా..? అదే నిజమైతే ఎవరా వ్యతిరేక వర్గాలు..? ఇదే అంశాన్ని ఇప్పడు తేల్చే పనిలో పడ్డారు కొల్ కతా పోలీసులు.

ముఖ్యమంత్రిని హతమార్చడంలో సహకారం అందిస్తే.. రూ 65 లక్షలిస్తామని ముర్షిదాబాద్‌ జిల్లా బెహ్రంపోర్‌లో 19 ఏళ్ల విద్యార్థికి వాట్సాప్ మెసేజ్ రావడం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా పెను కలకలం రేపుతుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న పాలిటెక్నిక్ విద్యార్థితో సంభాషించేందుకు ఉపయోగించే ఈ నెంబర్ కు మెసేజ్ వచ్చింది. అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి తనకు లాటిన్‌ అనే వ్యక్తి నుంచి మెసేజ్ లు వస్తున్నాయని ఈ మెసేజ్ లతో షాకైనట్లు విద్యార్థి చెప్పారు. మెసేజ్ లు పంపిన వ్యక్తి తనకు తాను ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తిగా చెప్పుకున్నాడని తెలిపాడు.

వాట్సాప్‌ మెసేజ్ లో ఏముంది..? అంలే తాము చెప్పినట్టు చేస్తే లక్ష డాలర్లు ( రూ 65 లక్షలు) ఇస్తామని, మీకు ఎలాంటి ప్రమాదం ఉండదని గుర్తుతెలియని వ్యక్తి సదరు విద్యార్థికి పంపిన మెసేజ్ ల్లో సంభాషించాడు. ఎవరో తను అటపట్టిస్తున్నారని అనుకున్న విద్యార్థి.. కొద్దిసేపు సమయం కావాలని కోరాడు. తమతో తొందరగా చేతులు కలపాలని, లేకుంటే వేరొకరిని ఎంపిక చేసుకుంటామని అగంతకుడు తొందరపెట్టాడని తెలిపాడు. ఈ మేరకు ఒత్తిడి పెంచినట్టు కూడా చెప్పాడు.

దీంతో నో థ్యాంక్స్ అని రిప్లై ఇవ్వగా మరికొద్ది సేపటికే మళ్లీ ఆన్ లైన్ లోకి వచ్చిన వ్యక్తి విద్యార్థిని లాసర్ (డబ్బు, అవకాశం కోల్పయినవాడి)గా పేర్కొన్నాడు. రాత్రి 3.30 గంటలకు మళ్లీ లైన్ లోకి వచ్చిన వ్యక్తి తాను త్వరలో భారత్‌ రానున్నట్టు చెప్పగా, తాను దేశాన్ని ప్రేమిస్తానని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడం తనకు ఇష్టం లేదని విద్యార్థి తేల్చిచెప్పారు. అయితే తాము భారత్ ను నాశనం చేయబోమని, కేవలం ఒకరిని చంపాలని మాత్రమే అనుకుంటున్నామని ఆ వ్యక్తి సంభాషించాడు. ఈ ఉదంతంపై పశ్చిమ బెంగాల్‌ సీఐడీ దర్యాప్తు జరుపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Berhampore Police Station  Kolkata police  Mamata Banerjee  Terror Plot  terrorism  Whatsapp  crime  

Other Articles