Folk singer Harshita Dahiya shot dead in Panipat యువగాయనిపై కాల్పులు.. ఢిల్లీలోని నడిరోడ్డుపై ఘటన

Harshita dahiya a 22 year old singer shot dead in haryana s panipat

Haryanvi singer, Harshita Dahiya, folk singer shot dead, dancer shot dead, Haryana, Singer killed, harshita shot dead in delhi, Panipat nes, haryana, crime news, crime

Dahiya had filed a complaint of rape against her brother-in-law, who is in jail now. She was also a witness in the murder case of her mother, who was killed a few months ago in Delhi.

యువగాయనిపై కాల్పులు.. ఢిల్లీ నడిరోడ్డుపై ఘటన

Posted: 10/18/2017 10:16 AM IST
Harshita dahiya a 22 year old singer shot dead in haryana s panipat

నేటితరం యువతకు కావాల్సిన చక్కని బాణీలను రచించి తన ముధురమైన స్వరంతో యువతను ఒలలాడించి.. అనతికాలంలోనే చక్కని జానపద గాయని, నృత్యకారిణిగా పేరుతెచ్చుకున్న హర్షితా దహియా(22)ను దేశరాజధాని ఢిల్లీలో గుర్తుతెలియని అగంతకులు అత్యంత దారుణంగా హతమార్చారు. దహియాపై పాయింట్ బ్లాంక్ రేంజీలో తలలో, గొంతులో ఆరు బుల్లెట్లను దించడంతో ఆమె ఘటనాస్థలిలోనే చనిపోయారని పోలీసులు వెల్లడించారు.

తన అల్బమ్స్ తో యువతను ఉర్రూతలూగించి.. హర్యానాతో పాటుగా ఉత్తరభారతావని రాష్ట్రాలలో ఎంతో పేరు తెచ్చుకున్నహర్షితా దహియా ఢిల్లీ నుంచి హర్యానా వెళ్తున్న క్రమంలో అమెపై దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఢిల్లీ పరిధిలోని నారెల్లాలో ఓ ప్రదర్శన ఇచ్చిన ఆమె, తిరిగి తన ప్రాంతమైన పానిపట్ తిరుగుపయనం అవుతున్న క్రమంలో అమెను వెంబడిస్తూ వచ్చిన ఇద్దరు అగంతకులు.. అమె కారును ఓవర్ టేక్ చేసి.. ఈ దారణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

హర్షిత కారుకు ఓవర్ టేక్ చేసిన దుండగులు.. అమె కారులో వున్న ఇద్దరినీ కారులోంచి దించిన తరువాత విఛక్షణా రహితంగా అమెపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపిన దుండగులు.. అమె చనిపోయిందని నిర్థారించుకున్న వెంటనే పరారయ్యారని సమాచారం. హర్షిత తలలో, గొంతులో ఆరు బుల్లెట్లు దిగాయని చామరా సీనియర్ పోలీస్ ఆఫీసర్ దేష్ రాజ్ తెలిపారు. కాగా, తనకు బెదిరింపులు వస్తున్నాయని, చంపుతామని అంటున్నారని ఇటీవల హర్షిత తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు, వీడియోలు పెట్టడం గమనార్హం. 'రాగిణి' సాంగ్స్ పాడుతూ, ఈమె చేసే నృత్యాలు హర్యానాలో ఎంతో ఫేమస్. హర్షిత హత్యపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haryanvi singer  Harshita Dahiya  Haryana  Singer killed  Panipat nes  haryana news  crime  

Other Articles