Collector Amrapali Treks To Dharma sagar Project గుట్టలెక్కగలనోయ్.. ట్రెక్కింగు చేయగలనోయ్..!

Warangal collector amrapali kata treks to visit dharma sagar project

Warangal, Urban District, Collector, IAS officer, Warangal Urban district Collector K. Amrapali, amrapali treks devanur hills, Amrapali Kata, Trekking, devanur hills, Dharma sagar Project, Telangana

Warangal Urban District Collector Amrapali Kata has been again in the head lines, she Treks devanur hills too visit Dharma sagar Project

గుట్టలెక్కగలనోయ్.. ట్రెక్కింగు చేయగలనోయ్..!

Posted: 10/13/2017 01:15 PM IST
Warangal collector amrapali kata treks to visit dharma sagar project

తెలుగు రాష్ట్రాలలో యువ ఐఎఎస్ అధికారుల జాబితాలో అత్యంత చురుగ్గా వుంటూ.. అటు సామాజిక మాద్యమంలో.. ఇటు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారంలో ముందండే కలెక్టర్లలో ముందువరుసలో వుండే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మరో మారు వార్తల్లో నిలిచారు. జిల్లాలోని దర్మసాగర్ ప్రాజెక్టును అమె కాలినడక సందర్శించడం మరోమారు చర్చనీయాంశంగా మారింది. చెట్టులెక్కగలావా..  గుట్టలెక్కగల వా..? అంటూ అమెను ఎవరైనా ప్రశ్నిస్తే.. అందుకు అమె నోటితో కాకుండా ఏకంగా చేతలతోనే బదులు చెబుతారు. ఎందుకంటే అమెకు కూడా ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని అమె గతంలోనే చెప్పారు.

ధర్మసాగర్‌ ఇనుపరాతి గుట్టలపై అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ అమె ట్రెక్కింగ్‌ నిర్వహించారు. విద్యార్థులు, ఔత్సాహికులతో కలిసి దేవునూర్‌ గుట్టలపై ట్రెక్కింగ్‌ చేశారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ వరంగల్ నగరానికి అత్యంత చేరువలో వున్న ఈ అడవిలో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. నగరం చెంత వున్నందున ఈ ప్రాంతానికి జిల్లావాసులతో పాటు వివిధ ప్రాంతాల పర్యాటకులు వచ్చేందుకు వీలుగా తయారు చేస్తామని చెప్పారు.

కాగా ఆమ్రపాలి గతంలో కూడా ట్రక్కింగ్లో పాల్గొన్న విషయం తెలిసిందే. దాదాపు రెండు మైళ్ల దూరం పాటు మహబూబాద్ జిల్లాలోని బయ్యారం చెరువు, పెద్ద గుట్టల్లో కలెక్టర్ ప్రీతీ మీనా, ఆమ్రపాలి కలిసి పర్యటించిన వీడియోలు అప్పట్లో నెట్టింట్లో సంచలనం రేపాయి. మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్ట కొండలపై నిర్వహించిన రాక్ క్లైంబింగ్‌ ఫెస్టివల్ లోనూ కలెక్టర్ ఆమ్రపాలి పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Warangal  Urban District  Collector  Amrapali Kata  Trekking  devanur hills  Dharma sagar Project  Telangana  

Other Articles