telangana woman alleges rape by Faridabad resident తెలంగాణ మహిళపై ఎమ్మెల్యే అభ్యర్థి అత్యాచారం

Mla contestant rapes telangana woman in delhi fir registered

telangana woman, domestic help, lodha estate, manager subash, Subash Chaudhary, Delhi Police, Chanakyapuri police station, rape, gangrape, molest, sexual assault on women, violence againgst women, delhi women police, MP domestic help, faridabad, haryana, crime

A complaint alleging rape against a Faridabad resident, who contested the Assembly elections in the state, Subash Chaudhary, has been registered by the Delhi Police in the Chanakyapuri police station lodged by telangana domestic help

తెలంగాణ యువతిపై ఎమ్మెల్యే అభ్యర్థి అత్యాచారం

Posted: 10/09/2017 02:53 PM IST
Mla contestant rapes telangana woman in delhi fir registered

ప్రేమ పేరుతో దగ్గరై.. పెళ్లి పేరుతో వంచన చేసి.. యువతిని అన్ని విధాలుగా అవసరాలు తీర్చుకుని అనక పెళ్లి మాటెత్తగానే పరాయయ్యే మృగాళ్లు అనేకం జనారణ్యంతో సంచరిస్తున్న ఘటనలు మనం చూస్తూనే వున్నాం. అయితే అంతటితో అగని ఓ మృగం.. ఏకంగా యువతికి చెందిన వారసత్వ అస్తిని కూడా కాజేసి.. కనిపించకుండా పోయాడు. తన ఆస్తి గురించి వెంటపడుతున్న తనను లోబర్చుకుని తనతో గడిపితే ఆ పత్రాలు ఇస్తానని నాలుగు పర్యాయాలు అత్యాచారం చేశాడని బాధితురాలు అరోపిస్తూ పోలీసులకు పిర్యాదు చేసింది.

పోలీసులను అశ్రయిస్తే తనకు తెలిసిన రాజకీయ నేతల సాయంతో పోలీసు కేసులను ఉపసంహరింపజేసుకుంటానని.. తనను మాత్రం హతమార్చుతానని కూడా హెచ్చరికలు చేశాడని కూడా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా గత కొన్ని రోజులుగా సదరు నిందితుడు ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి.. వెళ్లిపోయాడని తెలుస్తుందని, దీంతో తాను పోలీసులను అశ్రయించినట్లు చెబుతుంది బాధితురాలు. అయితే సదరు పైశాచిక మృగం గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఎన్నికల బరిలో నిలిచిందని సమాచారం.

ఘటన వివరాల్లోకి వెళ్తే... న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్ లో సుభాష్ అనే యువకుడు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అదే ఎస్టేట్ లో ఓ ఎంపీ ఇంట్లో తెలంగాణాకు చెందిన యువతి పనిమనిషిగా పనిచేస్తోంది. అమెతో రోజు మాట్లాడుతున్న సుబాష్ అమెను వివరాలను తెలుసుకున్నాడు. అమె పేరున వారసత్వంగా వచ్చిన ఆస్తి వుందని తెలుసుకున్న సుబాష్.. అమెతో అటు మాట్లాడుతూనే ఇటు తన తమ్మడిని వారి అమ్మవాళ్ల ఇంటికి పంపి.. అమె తల్లి చేత బలవంతంగా వేలిముద్ర వేయించుకున్నాడు.

అయితే ఇల్లు అమ్మినందుకు దాని తాలుకు రూ.25 లక్షలు ఇస్తామని చెప్పి.. బాధితురాలిని మోసం చేశాడు. డబ్బులొస్తాయని ఆశగా ఎదురు చూసిన ఆమె సుబాష్ ను తనతో గడిపితేనే డబ్బులిస్తానని చెప్పి.. సెప్టెంబర్ మాసంలో నాలుగు పర్యాయాలు అమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అయినా డబ్బులివ్వకుపోవడంతో బాధితురాలి నిలదీసింది. దీంతో ఓ వైపు హెచ్చరికలు, బెదరింపులు జారీ చేస్తూనే మరోవైపు ఉద్యోగానికి స్వస్తి పలికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఢిల్లీ మహిళా పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వారిని వేడుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana woman  domestic help  lodha estate  manager subash  faridabad  haryana  crime  

Other Articles