Has Pawan Kalyan changed his name? పవన్ కల్యాన్ పేరు మార్చకున్నారా..? కొత్త పేరేంటో..?

Has pawan kalyan changed his name his new name

pawan kalyan, kushal babu, name, social media, google, search engine, Jana sena, 175 seats, Telangana, Andhra pradesh

Power Star Pawan Kalyan get his name changed? yes says the biggest search engine, when googled, a name 'Kushal Babu' is shown under Pawan Kalyan's image which triggered an embarrassment among fans.

పవన్ కల్యాన్ పేరు మార్చకున్నారా..? కొత్త పేరేంటో..?

Posted: 10/03/2017 01:39 PM IST
Has pawan kalyan changed his name his new name

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన పేరును మార్చకున్నారా..? ఇప్పుడీ ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసేసందుకు రెడీ అంటూ ప్రకటించారా..? అంటే అవునన్న సంకేతాలు వినబడుతున్నాయి. ఇటు తెలంగాణలోనూ తమ బలం, ప్రాబల్యం వున్న ప్రతీ చోట ఎన్నికల బరిలోకి దిగుతామని పవన్ కల్యాన్ ప్రకటించారా..? అంటే మిశ్రమ జవాబులే వినబడుతున్నాయి. అదేంటి అంటే.. ఇందుకు కూడా కారణాలు లేకపోలేదు. అయితే ఇప్పుడీ ప్రశ్నలు మాత్రం తెలుగురాష్ట్రాలలో చర్చనీయాంశాలుగా మారాయి.

పేరు విషయానికి వస్తే.. కొణిదల కల్యాన్ బాబు.. పేరును ఆయన పవన్ కల్యాన్ గా తన స్ర్కీన్ నేమ్ మార్చుకున్నారు. దీంతో అభిమానులు పీకే అంటూ ముద్దుగా కూడా పిలుచుకుంటారు. అయితే ఆయన పేరు మార్చకున్నారన్న టాక్ అభిమానుల్లో సంచలనంగా మారింది. అయితే అది నిజమేనన్నట్లుగా ఆయన పేరును పవన్ కల్యాన్ అని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ లో టైప్ చేయగానే పవర్ స్టార్ ఫొటోలు వస్తున్నాయి..  అంతా ఓకే కదా.. మరి అలాంటప్పుడు పేరు మారిందని ఎలా అంటారు అనేగా మీ డౌట్..?

 ఫొటోలు పవన్ కల్యాన్ వే కానీ వాటి కింద పేరు మాత్రం పవన్ కల్యాన్ అనే లేక కొణిదల కల్యాన్ బాబు అనే వుండాల్సింది పోయి.. ఏకంగా కుషాల్ బాబు అని వస్తోంది. ఇది కేవలం పవన్ కల్యాన్ అనేు కాదు పవర్ స్టార్ అని టైమ్ చేసినా జనసేన అధినేత ఫొటోలే స్రీన్ పై వస్తున్నా.. కిందమాత్రం కుషాల్ బాబు అన్న పేరు వస్తుంది. దీంతో జనసేన అధినేత ఫ్యాన్స్, అభిమానులు కన్ఫ్యూజన్ రైజ్ అయ్యి హాట్ టాఫిక్ గా మారింది. దీనినే అభిమానులు కూడా షేర్ చేసుకోవడంతో అది కాస్తా సోషల్ మీడియా వైరల్ అయ్యింది.

ఈ విషయాన్ని గుర్తించి జనసేన పార్టీ ఆఫీస్ ఇప్పుడు గూగుల్ సిబ్బందితో మాట్లాడుతోంది. పవన్ కల్యాణ్ పేరు కుషాల్ బాబుగా తీసుకోవటాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. సెర్చ్ ఇంజిన్ లో ఇలా జరగటం కొత్తేమీ కాదు. గతంలోనూ లోకేష్ బాబు అని టైప్ చేస్తే.. పప్పు (దాల్) అని వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని పక్కన బెడితే జనసేన అధినేత అంధ్రప్రదేశ్ లోని 175 స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు వార్తలు ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వెనువెంటనే దానిని తొలగించారు. పవన్ సునామీ లాంటి అభిమానులకు చేరిన ఈ విషయాన్ని వారు మాత్రం తమ స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారు. ఇటు తెలంగాణలో కూడా తాము ఎన్నికల బరిలో నిలుస్తామని ట్విట్ సందేశమిచ్చింది. మరి ఈ ట్విట్ ను జనసేన వర్గాలు వెనువెంటనే తొలగించడంపై కారణమేంటో వారికే తెలియాలి. ఈ విషయంపై వారు ఏం వివరణ ఇవ్వనున్నారన్న అసక్తి అటు అభిమానులు, ఇటు పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా రేకెత్తుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  kushal babu  name  social media  google  search engine  Jana sena  

Other Articles