tirumala chief priest ramana deeshitulu controversy అపచారం: శ్రీవారికి ఆయనతో హరతి ఇప్పించారా..?

Tirumala chief priest ramana deeshitulu controversy

TTD, Executive Officer, Memo, Venkatapathi Dikshithulu, Ramana dikshithulu, Deputy EO, Kondanda Rama Rao, controversy, suryaprabha vahana seva, garbhalayam

Priests who have been opposing the move of TTD's Chief Priest Ramana Dikshithulu who assigned suryaprabha vahana seva to his son, has entered into garbhalayam along with son and grand children. venkatapathi dikshithulu had performed aarati to lord srivaru evokes controversy.

అపచారం: శ్రీవారికి ఆయనతో హరతి ఇప్పించారా..?

Posted: 10/03/2017 12:46 PM IST
Tirumala chief priest ramana deeshitulu controversy

తిరుమలలో మరో అపచారం చోటుచేసుకోవడం అది కాస్తా కొత్త వివాదానికి దారితీయడం.. దీంతో ఈ వివాదాన్ని ఎలా సద్దుమణిగించాలో తెలియని తిరుమల తిరుమల దేవస్థానం బోర్డు అధికారులు ఇది శరాఘాతంలా పరిణమించింది. ఈ వివాదానికి అజ్యం పోసింది మాత్రం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులే కావడం గమనార్హం. శ్రీవారి బ్రహోత్సవాల వేడుకలలో భాగంగా గత రెండేళ్లుగా అర్చక వృత్తికి దూరంగా వున్న తన కుమారుడికి ఏకంగా సూర్యప్రభ వాహనం సేవలలో పాల్గోనేందుకు అనుమతించడమే ఇందుకు కారణమైయ్యింది.

దీనిని వ్యతిరేఖించిన టీటీడీ మిగతా అర్చకులు.. విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అర్చక బృందంలో అత్యధిక మంది ఇది సమంజసం కాదని అక్షేపించడంతో.. వెంకటపతి దీక్షితులకు ఆ అవకాశాన్ని కల్పించకుండా.. వేరే అర్చకుడిని అ సేవలకు నిర్వహణకు నియమించారు దేవాలయ బోర్డు అధికారులు. దీంతో ఆలయ అర్చక వ్యవహారాలలో బోర్డుకు ఏం సంబంధముందని ఏకంగా ఆలయ డిఫ్యూటీ ఈఓ కోదండ రామారావును నిలదీశారు రమణ దీక్షితులు. వివాదం రేగిన నేపథ్యంలో అలయ బోర్డు ప్రధాన అర్చకులుకు నోటీసులు జారీ చేసిందని కూడా సమాచారం.

ఇదిలావుండగానే రమణ దీక్షితులు.. తన కుమారుడు వెంకటపతి దీక్షితులు, ఇద్దరు మనవళ్లతో కలిసి మహద్వారం ద్వారా ఉదయం ఐదున్నరకు ఆలయ ప్రవేశం చేశారు. శ్రీవారి సన్నిధికి చేరుకుని కుమారుడితో కలిసి కులశేఖరపడి దాటి గర్భాలయంలోకి చేరుకున్నారు. రమణదీక్షితులుకు గర్భాలయ ప్రవేశ అర్హత ఉన్నప్పటికీ.. తన కుమారుడు, మనవళ్లు గర్భాలయంలోకి వెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం అవుతుంది. వీఐపీ విరామ దర్శనం సమయంలో గర్భాలయంలోకి చేరుకుని కుమారుడి ద్వారా స్వామివారికి హారతి ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ విషయాన్ని అలయ బోర్డు అధికారులు కూడా స్పందిస్తూ.. ఈ విషయం వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. గత రెండేళ్లుగా ఆలయ విధులకు దూరంగా ఉన్న వెంకటపతి దీక్షితులు గర్బాలయంలోకి ఎలా ప్రవేశిస్తారని, స్వామివారికి ఎలా హారతిని ఇస్తారని మిగతా అర్చకులు టీటీడీ బోర్డు అధికారులను నిలదీస్తున్నారు. దీంతో వెంకటపతి దీక్షితులు గర్భాలయ ప్రవేశాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సీసీ టీవీ చిత్రాలను సేకరించారు. దీని ఆధారంగా నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరాలని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTD  Executive Officer  Memo  Venkatapathi Dikshithulu  Ramana dikshithulu  Deputy EO  

Other Articles