Warner, Finch Power Visitors To 334/5 ఓపెనర్ల విజృంభన.. టీమిండియా ఎదుట భారీ లక్ష్యం

India vs australia 4th odi warner finch power visitors to 334 5

India vs australia, Team India, virat kohli, steve smith, india cricket team, India v Australia, Hardik Pandya, bengaluru odi, 4th odi, Umesh Yadav, david warner, aaron finch, mohammad shami, australia vs india, cricket news, sports news, sports, cricket

Team India will aim to inch closer to a series whitewash, as well as post 10 consecutive wins in a row, beginning from their tour of the West Indies earlier this year.

ఓపెనర్ల విజృంభన.. టీమిండియా ఎదుట భారీ లక్ష్యం

Posted: 09/28/2017 05:13 PM IST
India vs australia 4th odi warner finch power visitors to 334 5

అస్ట్రేలియాతో బెంగళూరు వేదికగా జరుగుతున్న నాల్గవ వన్డేలో అస్ట్రేలియా దూకుడును కనబర్చింది. గత మూడు వన్డే మ్యాచులలో సాధ్యం కానీ భారీ లక్ష్యాన్ని కంగారులు టీమిండియాకు నిర్ధేశించారు. ఓపెనర్లు డెవిడ్ వార్నర్‌, ఆరోన్ ఫించ్ లు విజృంభించడంతో 35 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా చేజార్చుకోని అస్ట్రేలియా భారీ స్కోరును సాధించింది. ఫలితంగా విరాట్ సేన ఎదుట ఆసీస్‌ 335 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

బెంగళూరులో జరుగుతున్న నాల్గవ వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులు.. తొలుతు నిలకడగా అడి రాణించారు. తరువాత థాటిగా అడటం ప్రారంభించారు. ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌లు శుభారంభాన్ని అందించారు. తొలుత శతకం సాధించిన డేవిడ్ వార్నర్ 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 124 పరుగులు సాధించగా, ఫించ్ కూడా 10 ఫోర్లు, 3 సీక్సర్లతో 94 పరుగులు చేసి.. కొద్దిలో శతకాన్ని మిస్ అయ్యాడు. వార్నర్ ను కేదర్ జాదవ్ పెవిలియన్ కు పంపడంతో 231 పరుగుల వద్ద టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. ఆ తరువాత అరోన్ ఫించ్ ను ఉమేశ్ యాదవ్ రెండో వికెట్ గా పెవీలియన్ కు పంపాడు.

ఆ తరువాత క్రీజులోకి వచ్చి నిలదొక్కుకోని కెప్టెన్ స్టీవ్ స్మిత్(3)ను కూడా ఉమేష్ అవుట్ చేశాడు. స్మిత్ బ్యాట్ నుంచి మెరుపు వేగంతో వచ్చిన క్యాచ్ ను పట్టిన విరాట్ అతన్ని పెవీలియన్ బాట పట్టించాడు. అనంతరం క్రీజులోకి ట్రావిస్‌ హెడ్‌(29), హ్యాండ్‌స్కోంబ్‌(43)లు చెలరేగడంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 334 పరుగలు చేసింది. విరీద్దరూ ఉమేశ్‌ బౌలింగ్‌లో అవుటవ్వడం విశేషం. భారత బౌలర్లలో ఉమేశ్‌కు నాలుగు వికెట్లు, జాదవ్‌కు ఒక వికెట్‌ దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs sri lanka  Team India  virat kohli  steve smith  bengaluru odi  4th odi  cricket  

Other Articles