Girl in ‘suicide pact’ sent boyfriend nude pics of roommates రూమ్మేట్స్ నగ్నచిత్రాలే.. ఆ ప్రేమజంట ఆత్మహత్యకు కారణం

Girl in suicide pact sent boyfriend nude pics of roommates

Vrushali Lande, nursing student, St George’s Hospital, boyfriend, Suresh Shinde, private clinic, hostel mates, police station, Nude pictures, MRA Marg police, Kalyan, mumbai, maharashtra, JJ Groups of Hospital, crime

The young couple who jumped in front of a running train last week had exchanged intimate pictures of two women, and the fear that authorities would find out drove them to end their life, according to the suicide note.

రూమ్మేట్స్ నగ్నచిత్రాలే.. ఆ ప్రేమజంట ఆత్మహత్యకు కారణం

Posted: 09/28/2017 04:33 PM IST
Girl in suicide pact sent boyfriend nude pics of roommates

ప్రేమించిన వాడు చెప్పిన చేయకూడని పని చేసిన ఆ ప్రియురాలు అడ్డంగా పట్టుబడింది. విషయాన్ని ప్రియుడికి తెలిపింది. దీంతో తమను పోలీసులు బుక్ చేస్తారని, భయపడిన ప్రేమజంట.. భయంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. గత వారం రైల్వే పట్టాలపై విగత జవుల్లా పడివున్న వీరి అత్మహత్య వెనుక గత కారణాలను తెలుసుకున్న పోలీసులు నివ్వెరపోయే విషయాలను తెలుసుకున్నారు. థానే జిల్లా కల్యాణ్ పట్టణంలో జరిగిన ఘటన ఇలాంటి పనులకు ఎవరూ పునుకోవద్దన్న సందేశాన్ని కూడా నేటి యువతకు అందిస్తుంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హాస్టల్ లో ఉంటూ, సెయింట్‌ జార్జ్‌ ఆసుపత్రిలో నర్సుగా శిక్షణ పొందుతున్న 21 సంవత్సరాల వృశాలి లండే.. స్థానికంగా ఓ ప్రైవేటు అస్పత్రిలో మేల్ నర్సుగా పని చేస్తున్న సురేశ్‌ తో ప్రేమలో ఉంది. అతని కోరిక మేరకు హాస్టల్ రూమ్ మేట్స్ నగ్న చిత్రాలను తీసి సురేశ్‌ కు పంపి పెద్ద తప్పే చేసింది. సురేష్ తో జరిగిన చాటింగ్ లో ఈ విషయాన్ని వృశాలి రూమ్ మేట్స్ తెలుసుకున్నారు. దీంతో అమె అడ్డంగా బుక్కయ్యింది. దీంతో వారు వృశాలితో ఈ మేరకు ఓ నోట్ రాయించుకున్నారు.

అయితే తమ నగ్న చిత్రాలను సురేష్ ఏం చేశాడన్న సంగతి తెలియని వృశాలి స్నేహితులు.. తమ చిత్రాలు ఎక్కడ బయటపడినా దానికి వారే బాధ్యులని కూడా రాయించుకున్నారు. సురేశ్‌ బలవంతం చేయడంతో తాను ఈ తప్పుడు పని చేశానని కూడా రాయించుకున్నారు. ఇకపై వృశాలిని సురేష్ షిండేతో కలవకూడదని కూడా హెచ్చరించారు. లేనిపక్షంలో తాము ఈ కాయితాన్ని పోలీసులకు అందజేసి పిర్యాదు చేస్తామని చెప్పడంతో భయపడిన వృశాలి.. కొన్ని రోజుల పాటు సురేష్ ను కలవకుండా జాగ్రత్త పడింది.

అయినా, సురేష్ తో వృశాలి బంధం తెగలేదు. ఇదే విషయమై స్నేహితురాళ్లతో 23న గొడవ కూడా పడింది. ఆపై హాస్టల్ వదిలి వెళ్లిన వృశాలి, సురేష్ కు విషయం చెప్పింది. తన ఫ్రెండ్స్ ఎక్కడ పోలీసు కేసు పెడతారోనన్న భయంతో వీరిద్దరూ సమీపంలోని రైలు పట్టాలపైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. హాస్టల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వృశాలి గది నుంచి ఆత్మహత్యకు దారితీసిన కారణాల లేఖను స్వాధీనం చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. స్మార్ట్ ఫోన్లు అవసరానికి ఎంత బాగా వినియోగిస్తే అంత మంచిది.. కానీ అనవసర విషయాలకు వినియోగిస్తే ఇలాంటి దారుణాలకే దారితీస్తాయని ఈ ఘటన మరోమారు రుజువు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles