government bans sale of loose cigarettes స్మో‘కింగ్’లకు ప్రభుత్వం షాక్.. లూజ్ కు చెక్..!

Government bans sale of loose cigarettes tobacco products

karnataka bans loose cigerattes, karnataka new notification, karnataka bans tobacco products, State government, Karnataka, Ban on loose sales, cigarettes, tobacco products, notification

Karnataka government took a bold step by issuing a formal notification banning loose sale of cigarettes, beedis and chewing tobacco products with immediate effect.

స్మో‘కింగ్’లకు ప్రభుత్వం షాక్.. లూజ్ కు చెక్..!

Posted: 09/28/2017 06:42 PM IST
Government bans sale of loose cigarettes tobacco products

స్మోకింగ్ లకు ప్రభుత్వం షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై కర్ణాటకలో ఎక్కడా లూజ్ సిగరెట్లు లభ్యం కాకుండా కొత్తగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడంపై చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం జేబులో చిల్లర వుంటే సిగరెట్లు, బీడల కోసం పరుగులు తీస్తున్న వారి సంఖ్య ఎక్కవని గమనించి.. ఇకపై జేబులో చిల్లరవున్నా సిగరెట్లు దొరక్కుండా చేస్తే స్మోకర్ల సంఖ్య తగ్గుతుందని.. ప్రభుత్వం అంచనా వేస్తుంది.

బహిరంగ ప్రదేశాల్లో దూమపానం చేసే వారి సంఖ్య కూడా అలాగే తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో సిగరెట్లతో పాటు వివిధ రకాల పొగాకు ఉత్పత్తులను విడిగా విక్రయించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం లూజ్‌ సిగరెట్లు, బీడీలు, చూయింగ్‌ పొగాకు ఉత్పత్తుల విక్రయం ఇక మీదట నేరంగా పరిగణిస్తారు. 2003 కోప్టా చట్టంలోని సెక్షన్లు 7, 8 ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది.  

తాజా ఆదేశాల ప్రకారం... సిగరెట్లను లూజ్ గా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని సదరు శాఖ కార్యదర్శి డాక్టర్ శాలిని రాజేష్ చెప్పారు. ఇ్పడటికే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధంతో  ధూమపానం  తగ్గినప్పటికీ   లూజ్‌ సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. ఈ నిషేధం పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని మరింత తగ్గిస్తుందని తాము భావిస్తున్నాన్నారు. కాగా ఈ నోటిఫికేషన్ ను ఈ నెల 11నే జారీ చేసినా.. ఇవాళ్లి నుంచే అమల్లోకి వస్తుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : State government  Karnataka  Ban on loose sales  cigarettes  tobacco products  notification  

Other Articles