Woman constable fights with conductor in RTC bus మహిళా ‘కాకీ’కి వెనకేసుకోచ్చిన పోలీసులు..

Woman constable fights with conductor in rtc bus

RTC bus, mahaboobnagar bus, lady constable, woman conductor, verbal spat, physical attack, shoba rani, rajitha kumari, nawabpeta, nawabpet police, viral video, video viral, trending

Passengers in an RTC Bus in Mahboobnagar are shocked to see a sudden quarrel that took place between a woman conductor and a woman constable.

ITEMVIDEOS: లేడీస్ ఫైట్: మహిళా ‘కాకీ’కి వెనకేసుకోచ్చిన పోలీసులు..

Posted: 09/28/2017 01:14 PM IST
Woman constable fights with conductor in rtc bus

ఇద్దరూ కాకీ దుస్తులు ధరించి విధులు నిర్వహించే వారే. అయితే ఒకరు పోలీసు కానిస్టేబుల్ కాగా, మరోకరు అర్టీసీ కండక్టర్. నిబంధనల ప్రకారం ఎవరి విధులను వారి నిర్వహిస్తుంటారు. అయితే వీరిద్దరూ అనుకోకుండా ఒకరికోకు వాగ్వాదానికి దిగి అది కస్తా ఘర్షణకు దారి తీస్తే.. తమ గూటికి చెందిన పక్షిదే తప్పైనా రాజీ కుదర్చి పంపారు పోలీసులు. అదే కండక్టరుదే తప్పని తేలివుంటే.. పోలీసుల విధులను అటంకపర్చినందుకు కండక్టరుపై కేసు నమోదు చేసి.. సెక్షన్ల మీ సెక్షన్లు పెట్టి మరీ కటకటాల వెనక్కి నెట్టేవారు. ఈ తతంగానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

అధికారంలోకి వచ్చి రాగానే ముందుగా పోలీసులకు వెతనాలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. అదే సమయంలో వారికి కొన్ని సూచనలు కూడా చేసింది. చిన్న చిన్న విషయాలకు చేయి చాచడం మానేయండీ.. మీరు గౌరవంగా బతికేందుకు మీ వేతలను అర్థం చేసుకుని వేతనాలను పెంచుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసినా.. అలావాటు పడిన ప్రాణం.. ఎక్కడ అగుతుంది. అందుకనే బస్సులో ఓ మహిళా కానిస్టేబుల్ టిక్కెట్ లేకుండా ప్రయాణం చేసింది. పైగా మహిళా కండక్టరుతో వాగ్వాదానికి దిగింది. అంతటితో అగకుండా దాడికి కూడా పాల్పడింది. కేవలం టిక్కెట్ తీసుకోమ్మని చెప్పినందుకే ఇదంతా జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

దీంతో నేరుగా బస్సును నవాబుపేట పోలిస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన డ్రైవర్.. పంచాయితీని అక్కడే పెట్టించగా, తమ గూటి పక్షి, అందులోనూ తమ స్టేషన్ లోనే విధులు నిర్వహించే కానిస్టేబుల్ రజిత కుమారీని వెనకేసుకువచ్చి.. రాజీ కుదిర్చారు. ఇక స్టేషన్ లో తాను ఐడి కార్డు లేదని, జిరాక్స్ చూపించినా టిక్కెట్ తీసుకోవాలని కండక్టర్ శోభారాని నిలదీసిందని.. డ్రెస్ లో వున్నా టిక్కెట్ తీసుకోవాలా..? వారెంట్ చూపించాలట అంటూ గద్దించింది. అమెను శాంతపర్చిన పోలీసులు.. కండక్టర్ శోభారాణిని సముదాయించి పంపడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.

టిక్కెట్ తీసుకోవాలని చెప్పినందుకు కానిస్టేబుల్ రజిత కుమారి తనపై దాడి చేసిందని, అమె వద్ద వారెంట్ లేకుండా బస్సు ఎక్కిందని, అయితే పద్దతిగా టికెట్ తీసుకోవాలని చెప్పినా.. వితండవాదానికి తెరలేపుతూ అమె మాట్లాడిందని, చెక్కింగ్ స్వాడ్ వస్తే కానిస్టేబుల్ మూలంగా తానకు ట్రాక్ రికార్డు దెబ్బతింటుందని కండక్టర్ శోభారాణి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది. అయితే కేసులు గట్రాలు ఎందుకు డ్యూటీ వదులుకుని స్టేషన్, కోర్టులు ఎం తీరుగుతారని కండక్టర్ తో రాజీ కుదిర్చారు పోలీసులు. కాగా, బస్సులో ఇరువురు ఘర్షణ పడుతున్న సమయంలో అందులో ఉండే ఓ ప్రయాణికుడు వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది ఈ ఘటనపై ఎస్పీ అనురాధ విచారణకు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles