Woman physically removed from Southwest flight కంప్లైంట్ చేసిందని కనికరం లేకుండా ఈడ్చిపారేశారు..

Woman passenger forcibly pulled off southwest plane

Cellphone, video clip, police officers, woman passenger, Southwest airlines, Baltimore to Los Angeles, life-threatening pet allergy, medical certificate, Airlines, Southwest Airlines Co, Transportation, Airlines, United Continental Holdings Inc, viral video, video viral, trending

Cellphone video shows police officers pulling a woman off a Southwest flight from Baltimore to Los Angeles on Tuesday after she told the airline she had a life-threatening pet allergy when she learned there were animals on the plane.

ITEMVIDEOS: కంప్లైంట్ చేసిందని కనికరం లేకుండా ఈడ్చిపారేశారు..

Posted: 09/28/2017 12:17 PM IST
Woman passenger forcibly pulled off southwest plane

అగ్రరాజ్యంలో మహిళలకు కనీస గౌరవ మర్యాదులకు కూడా దక్కకుండాపోతున్నాయి. మహిళలన్న కనికరం కూడా లేకుండా.. అమెరికా పోలీసులు సాగించిన దౌర్జన్యకాండ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. కంప్లైంట్ చేసిందని ఓ మహిళ ప్రయాణికురాలిపై అధికారులు సాగించిన జులుం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహిళను తాకరానీ చోటు తాకుతూ.. పట్టుకోకూడని చోట పట్టుకుని.. బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకువెళ్లిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

అమెరికాలోని బాల్టీమోర్ నుంచి లాస్ యాంజిల్స్ వెళ్తున్న ఓ సౌత్‌ వేస్ట్‌ ఎయిర్‌లైన్స్ విమానంలో లో ఓ మహిళ ప్రయాణికురాలు వెళ్లేందుకు సిద్దమైంది. అయితే ఆ విమానంలో రెండు పెంపుడు జంతువులు వున్నాయని తెలుసుకున్న అమె.. తనకు పెంపుడు జంతువులతో ప్రాణానికి హానీ కలింగించే అలెర్జీ వుందని అధికారులకు పిర్యాదు చేసింది, అయితే అందుకు సంబంధించిన డాక్డర్ సర్ఠిఫికెట్ మాత్రం లేదని చెప్పింది. శునకాలను విమానం నుంచి దింపాలని కోరింది.

అయితే.. సాధ్యమైయితే అవుతంది.. లేకపోతే లేదని చెప్పాల్సిన విమాన సిబ్బంది వ్యవహరించిన తీరు అందుకు భిన్నంగా వుంది. జంతువులను దింపేందుకు నిరాకరించిన సిబ్బంది.. మహిళా ప్రయాణికురాలినే విమానం నుంచి దింపేశారు. అది కూడా అత్యంత దౌర్జన్యంగా. అమె తాను దిగను మొర్రో అని మొత్తుకుంటున్నా.. వినిపించుకోని పోలీసులు.. అమెను బలవంతంగా విమానం నుంచి ఈడ్చిపారేశారు. అయితే ఈ క్రమంలో అమె మహిళా అన్న కనీస కనికరం కూడా లేని పోలీసులు అమెను తాకరాని చోట తాకుతూ, పట్టుకోరాని చోట పట్టుకుని.. దౌర్జన్యంగా విమానం నుంచి ఈడ్చిపారేశారు.

తమ నాన్నకు సర్జరీ వుందని, తాను ఖచ్చితంగా వెళ్లాలని ప్రాధేయపడినా.. పోలీసులు కనుకరించలేదు.. తాను ప్రోఫెసర్ ను మీరసలు ఏం చేస్తున్నారని అడిగినా.. పట్టని పోలీసులు అమెను బలంవంతగా కిందికు దింపేశారు. తనపై చేతులు వేయవద్దని చెబతున్నా.. అధికార లైంగిక వేధింపులకు పాల్పడిన పోలీసులను నెట్ జనులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అదే విమానంలో వున్న హాలివుడ్ నిర్మాత బిల్ డుమాన్ ఈ తతంగాన్ని తన మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles