AP government serious on kanigiri incident కనిగిరి ఘటనపై సీఎం చంద్రబాబు సిరీయస్..

Andhra pradesh government serious on kanigiri incident

sai, kartheek, pavan, kanigiri rape, girl molested, nannapaneni rajakumari, women commission chair person, degree girl sexual assault, Andhra Pradesh, ‪‪Prakasam district‬, Hyderabd rape attempt, ‪Kanigiri‬‬, Kanigiri rape, ‪Ongole‬, Prakasam rape, andhra pradesh, crime

Andhra Pradesh Government responds in a very serious way on prakasam district kanigiri attempt rape case.

కనిగిరి ఘటనపై సీఎం చంద్రబాబు సిరీయస్..

Posted: 09/27/2017 04:54 PM IST
Andhra pradesh government serious on kanigiri incident

స్నేహితురాలిపై అత్యంత దారుణంగా వ్యవహరించి.. లైంగిక దాడికి యత్నించి.. సదరు దృశ్యాలను తమ సెల్ ఫోన్ లలో చిత్రీకరించి.. రాక్షసానందం పోందిన కనిగిరి పైశాచిక మృగాలను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపినా.. ఆ మృగాళ్లపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని అంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మగమృగాళ్ల నుంచి బాధితురాలి కుటుంబానికి ఎప్పటికీ ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులను అదేశించింది

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలను అడిగి చంద్రబాబు వివరాలను తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పోలీసులు ఇప్పటికే నిందితులపై నిర్భయ చట్టం, అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలి తల్లి పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అరోపించిన నేపథ్యంలో సదరు విమర్శలపై కూడా సీఎం పోలీసులతో వాకాబు చేసినట్లు సమాచారం.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు తమ పిర్యాదుపై స్పందించలేదని, దీంతో నిందితులు సోషల్ మీడియాలో ఆ ఘటన తాలుకు వీడియోలను పోస్ట్ చేశారని అమె అరోపించారు. పోలీసులు అప్పుడే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని వుంటే ఇలా జరిగేది కాదని, నిందితులు తమను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి నిందితుల తరపున వకాల్లా పుచ్చుకన్నారని అమె అరోపించారు. మీ అమ్మాయే అల్లరవుతుందని సముదాయించే ప్రయత్నం చేశారని బాధితురాలి తల్లి అరోపించారు.

కనిగిరి ఘటనలో బాధితురాలని పరామర్శించాలని, అమె కుటుంబసభ్యులను ఓదార్చాలని కూడా మహిళా కమీషన్ ను సర్కార్ అదేశించిన నేపథ్యంలో ఇవాళ మహిళా కమీషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారీ బాధితురాలిని పరామర్శించారు. పిచ్చి కుక్కలా బాలికపై తెగబడిన యువకులను చట్టం కఠినంగా శిక్షిస్తుందని అమె అన్నారు. అమెతో పాటు వైసీపీ నేతలు కూడా బాధితురాలిని అండగా వుంటామని భరోసా ఇచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student  friends  lover  sai  kartheek  paven  sexual assault  rape attempt  kanigiri  prakasam  nannapaneni rajakumari  crime  

Other Articles