Martur SI attacked by thieves with Knives బరి తెగించిన దోపిడీ దొంగలు.. మాటు వేసి ఎస్సైపైనే దాడి

Martur si nagamalleswara rao attacked by thieves with knives

Prakasham,Martur Highway,Thieves,Robbery,Thieves attack on Police,Robbery Plan,Thieves attack with Knives on Police,Thieves attack on Police Officers,Martur Highway Robbery,Robbery Gangs,Bihar Robbery Gangs,Martur Police Attack. crime

Martur SI Nagamalleswara Rao attacked by thieves with Knives on prakasham highway, where he noticed bihar, and odisha gangs are planning for robbery.

బరి తెగించిన దోపిడీ దొంగలు.. మాటు వేసి ఎస్సైపైనే దాడి

Posted: 09/25/2017 01:00 PM IST
Martur si nagamalleswara rao attacked by thieves with knives

దోపిడి దొంగల బరి తెగించారు. ఏకంగా విధి నిర్వహణలో వున్న ఎస్ఐ పైనే దాడి చేసి గాయపర్చారు. ప్రకాశం జిల్లా మార్టురులో జరిగిన ఈ దాడి స్థానికంగా కలకలం రేపింది. గత కొంతకాలంగా మార్టూరు జాతీయ రహదారిపై బీహార్, ఒడిశాలకు చెందిన దోపిడి దొంగల ముఠాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ రహదారిపై నుంచి వెళ్తున్న లారీలు, వాహనాలను అపి దొరికినంతా దోచుకుంటున్నారు. కార్లు ఇతర వాహనాదారులను భయాందోళనకు గురిచేసి బంగారం ఇతర విలువైన వస్తువులు, నగదు దోచుకుంటున్నారు.

ఇక లారీ డ్రైవర్ల నుంచి మాత్రం రెండు నుంచి వారి వద్ద ఎంత డబ్బుంటే అంతా దోచేసుకుంటున్నారు. అయితే బాధితుల్లో కొందరు స్థానిక పోలిస్ స్టేషన్ లో దారిదోపిడిపై పిర్యాదు చేయగా, మరికోందరు ఏకంగా జిల్లా ఎస్సీకి కూడా పిర్యాదు చేశారు. ఈ మేరకు సమాచరాం అందుకున్న ఎస్ఐ నాగమల్లేశ్వర రావు జిల్లా ఎస్పీకి సమాచారం అందించి.. ఆయన అదేశాల మేరకు గత రెండు మూడు రోజులుగా ఈ రహదారిపై తనిఖీలు చేపట్టారు.

కాగా ఇవాళ తెల్లవారుజామున జాతీయ రహదారిపై మార్టూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు బృందం తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆరుగురు వ్యక్తులు అనుమానంగా సంచరిస్తుండడం వారి కంట పడింది. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ, ఇతర కానిస్టేబుళ్లు వారిని ప్రశ్నించడం జరిగింది. వెంటనే దొంగలు దాడి చేశారు. ఎస్ఐని పట్టుకుని కత్తులతో పొడిచే ప్రయత్నం చేశారు. చాకచక్యంగా ఈ దాడి నుండి ఆయన తప్పించుకన్నారు. అనంతరం దొంగలు అక్కడి నుండి పరారయ్యారు. భుజంపై కత్తిపోట్లకు గురయిన ఎస్ఐని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Martur Highway  Thieves  Robbery  SI  Nagamalleshwar Rai  AP Police  Prakasham  crime  

Other Articles