Yellandu Municipal Commissioner manhandled by TRS activists గులాబీ నేతల గుండాగిరి.. కమీషనర్ పైనే దాడి..

Badradri trs activists attacks on yellandu municipal commissioner

Yellandu Municipal Commissioner, Ravi Babu, TRS activists, Library Chairman, Rajender, flexis, banners, police complaint, KT RamaRao. crime

Once again TRS activists high-handedness was reported, as they allegedly attacked Yellandu Municipal Commissioner in the late hours of Sunday.

గులాబీ నేతల గుండాగిరి.. కమీషనర్ పైనే దాడి..

Posted: 09/25/2017 11:55 AM IST
Badradri trs activists attacks on yellandu municipal commissioner

అధికారంలో ఏ పార్టీ అధికారంలో వుంటే సహజంగా అ పార్టీ నేతల గుండాగిరి, దౌర్జన్యకాండలు రాష్ట్రంలో పెచ్చుమీరుతాయన్న విషయం సాధారణంగా అందరికీ తెలిసిందే. అయితే ఇదే కేవలం ఇదర పార్టీ కార్యకర్తల వరకో.. లేక చిన్న చిన్న అధికారుల వరకో సాగుతుందన్న విషయం కూడా తెలుసు. కానీ ఏకంగా మున్సిపల్ కమీషనర్ ఇంటికే వెళ్లి దాడి చేసేంత తీవ్రస్థాయిలో వుంటుందని మాత్రం ఎవరూ ఊహించనిదే. కానీ అలాంటి దౌర్జన్యానికే తెలంగాణలోని ఇల్లందులో అధికార పార్టీకి చెందిన నేతలు జిల్లాలో టీఆర్ఎస్ నేతలు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

స్వచ్ఛా తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఎక్కడా పర్యావరణకు హాని కలిగించే విధంగా ఎలాంటి బ్యానర్లు.. ఫ్లెక్సీలు పెట్టకూడదని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి, సీఎం కుమారుడు కేటీఆర్ అదేశాలను తూచా తప్పకుండా పాటించడమే ఆ అధికారి పాలిట శాపంగా పరిణమించింది. మంత్రి జారీ చేసిన అదేశాలను అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే ఉల్లంఘించడంతో.. వాటిని పాటించాలని పూనుకున్న అధికారిపై దౌర్జన్యకాండకు దిగారు. దాడులకు తెగబడ్డారు కార్యకర్తలు.

వివరాల్లోకి వెళ్తే.. ఏ అధికార..అనధికార కార్యక్రమమైనా నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని స్వయంగా మంత్రి కేటీఆర్ కిందిస్థాయి నేతలకు సూచనలు.. ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన జారీ చేసిన అదేశాలను ఇల్లందు పురపాలక సంఘం కమీషనర్ తూచా తప్పకుండా పాటించారు. రోడ్లపై ఎక్కడా ఎలాంటి ఫ్లెక్సీలు లేకుండా తొలగించి.. స్వచ్చా ఇల్లందుకోసం పూనుకున్నారు. అయితే  నూతనంగా ఇల్లందు గ్రంథాలయ ఛైర్మన్ గా ఎన్నికైన రాజేందర్..  ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ నేతలు ఇల్లందు పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

 మున్సిపల్ నుండి అనుమతులు తీసుకోకపోవడంతో ఆ శాఖ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు ఆగ్రహోదగ్రులయ్యారు. మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఇంటికి వెళ్లి ఆయనపై దాడి చేశారు. దీనితో ఆయన తీవ్రమనస్థాపానికి గురయ్యారు. టీఆర్ఎస్ కార్యకర్తల ఆగడాలను ఆపాలని ఆయన ఇల్లందు పీఎస్ కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు.. ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో.. స్వచ్ఛా ఇల్లందుకు ఓటు వేస్తారా.. అధికార పక్షానికి లొంగిపోతారా..? లేకపోతే ఇద్దరి మధ్య రాజీ కుదర్చి.. కథను కంచికి పంపుతారా.? అన్నది వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yellandu  Municipal Commissioner  TRS activists  Library Chairman  flexis  crime  

Other Articles