Actress Kanchana Moitra molested, two held అర్థరాత్రి తెలుగు నటిపై లైంగిక వేధింపులు..

Tollywood actress molested on kolkata street two arrested

tollywood, tollywood news, tollywood actress, kanchana moitra, actress molestation, actress assault, who is kanchana moitra, kanchana moitra actress, kanchana moitra bengali actress, molestation, molestation details, kanchanan moitra detail, actress molested, tollywood actress molested, kolkata actress molested, kolkata actress, film news, celebs news, crime

Tollywood actress was allegedly molested in the city and threatened with dire consequences when she was returning to her Behala residence, in south west

అర్థరాత్రి తెలుగు నటిపై లైంగిక వేధింపులు..

Posted: 09/20/2017 04:53 PM IST
Tollywood actress molested on kolkata street two arrested

కోల్‌కతాలో తెలుగు నటిపై ఇద్దరు దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. క్రితం రోజు రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని అర్థరాత్రి అమె ఇంటికి తిరిగి వెళ్తుండగా.. కారును అపి దౌర్జన్యంగా డర్ తీసి తనను అసభ్యకరంగా తాకుతూ భయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించిన.. అసభ్యపదజాలాన్ని వినియోగించి దుర్భాషలాడారు. దీంతో అమె స్థానిక పోలీసులను అశ్రయించి ఘటనపై పిర్యాదు చేసింది. దీంతో ఘటనకు పాల్పడిన ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
 
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రాత్రి ఒంటిగంట సమయంలో సిరితి క్రాస్‌రోడ్డు వద్ద మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై అడ్డంగా నిలబడ్డారని బాధిత నటి ఫిర్యాదులో పేర్కొనింది. వారిలో ఒకరికి పక్క నుంచే కారు వెళ్లడంతో తనను నిలిపివేసి, కారు తాళాలు లాగేసుకున్నారని అమె పిర్యాదులో పేర్కోనింది. అనంతరం తనను బయటికి లాగి అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. కొల్ కతాలోని టాలీగుంజే ప్రాంతంతో చోటుచేసుకుంది.

బాధిత నటి పిర్యాదులో కేసు నమోదు చేసుకున్న బెహాలా పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. నటి లైంగిక వేధింపుల కేసులో ముగ్గరు నిందితుల్లో ఇద్దరని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నటిని వేధించిన ఇద్దరు యువకులను శంకర్ డౌల్లీ, సురజీత్ పాండాలుగా గుర్తించామని, వారిద్దరూ స్థానిక హరిదేవ్ పూర్ ప్రాంతంలో వుండగా వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దక్షిణ కొల్ కతా ప్రాంతంలోని హరిదేవ్ పూర్ రాజారామ్ మోహన్ రాయ్ కాలనీలో వీరి నివాసులని తెలిపారు. నటి పిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే వీరిని అరెస్టు చేశామన్నారు. నిందితులపై 341, 354, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress  molestation  kanchana moitra  assault  bengali actress  tollywood actress  kolkata  tollywood  crime  

Other Articles