Central, State Goods and Services Tax challenged జీఎస్టీలో కేంద్ర, రాష్ట్ర విధానంపై సవాల్.. నోటీసులు జారీ

Gst being used to fleece restaurant goers

Central Goods and Services Tax, State Goods and Services Tax, Ram Vilas Paswan, Consumer Affairs, Service Charge, GST Council, Chief Commissioner of Central Taxes, High Court at Hyderabad, Ramesh Ranganathan, Justice J Uma Devi, Hyderabad, service tax, latest news

A petition challenging the validity of Central Goods and Services Tax (GST) and Telangana Goods and Services Tax has been filed in the High Court at Hyderabad. Notices were issued.The Union Minister for Consumer Affairs

జీఎస్టీలో కేంద్ర, రాష్ట్ర విధానంపై సవాల్.. నోటీసులు జారీ

Posted: 09/15/2017 09:35 AM IST
Gst being used to fleece restaurant goers

విలువ అధారిత పన్ను విధానం పోయి కొత్తగా వస్తవులు, సేవా పన్ను (జీఎస్టీ) రావడంతో దీనిపై ప్రజలకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో దొరికిందే అదనుగా రెస్టారెంట్ల అటు కేంద్ర జీఎస్టీ అని, ఇటు రాష్ట్ర జీఎస్టీ అని రెండుగా విభజించి తీసుకోనుండటంతో.. అసలు తాము తీసుకున్న అహారం ఖర్చును ఎన్ని సార్లు పన్నులు కట్టాలన్న వాదన తెరపైకి వస్తుంది. దీంతో ఈ విధానాన్ని పలువురు న్యాయవాదులు రాజ్ కుమార్ తో పాటు మరో ఇధ్దరు హైదరాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు.

న్యాయవాదులు దాఖలు చేసిన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులను జారీ చేసింది. దీంతో పాటు జీఎస్టీ కౌన్సిల్ చైర్ పర్సెన్, కేంద్రీయ పన్నుల ప్రధాన కమీషనర్ కు కూడా హైకోర్టు నోటీసులను పంపించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జే.ఉమాదేవిలతో కూడిన ద్విసభ్య ధర్మస్థానం ఈ మేరకు  నోటీసులను జారీ చేసింది. ప్రతివాదులను తమ కౌంటర్ అఫిడెవిట్ లను దాఖలు చేయాల్సిందిగా అదేశించింది.

ఇదిలావుండగా, రెస్టారెంట్లు, కేఫ్‌లు, హోటళ్లలో సర్వీసు ఛార్జ్‌ తప్పనిసరి కాదని కేంద్రం ఇటీవల స్పష్టం చేసినప్పటికీ.. ఇంకా కొన్ని రెస్టారెంట్లలో సర్వీస్‌ ఛార్జీలు బలవంతంగా వసూలు చేస్తున్నారని కేంద్ర దృష్టికి రావడంతో.. వారిపై కొరడా ఝుళిపించింది. సర్వీస్‌ ఛార్జీలను బలవంతంగా వసూలు చేసే రెస్టారెంట్లు.. దానిపైన కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ సీబీడీటీకి ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాసవన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. రెస్టారెంట్లలో సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు హెల్ప్‌లైన్‌, మీడియా ద్వారా ఫిర్యాదులు వచ్చాయని పాసవన్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఇకపై రెస్టారెంట్ల నుంచి పన్నులు తీసుకుంటున్నప్పుడు అందులో సర్వీస్‌ ఛార్జీని కూడా కలపాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించినట్లు పేర్కొన్నారు. అంటే రెస్టారెంట్లు బలవంతంగా సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేస్తే.. దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రెస్టారెంట్లు, హోటళ్లలో తినే ఆహారానికి సర్వీస్‌ ఛార్జీ తప్పనిసరి కాదని చెబుతూ ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం సరికొత్త నియమావళిని విడుదల చేసిన విషయం తెలిసిందే. సిబ్బంది చేసే సర్వీసు నచ్చితే కస్టమర్లు అందుకు డబ్బులు ఇస్తారని.. లేదంటే ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు తమ బిల్లులో సర్వీస్‌ ఛార్జ్‌ కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలని లేకపోతే ఆప్షనల్‌ అని రాయాలని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles