KCR invites PM to inaugurate Hyderabad Metro హైదరాబాద్ మెట్రోరైలు.. తొలికూతకు వేళాయరా..!

Telangana cm invites pm modi to inaugurate hyderabad metro

Hyderabad metro rail project, Hyderabad metro rail project phase one, Telangana chief minister, Narendra Modi, Andhra Pradesh, Hyderabad, transport and logistics, railway, PM Modi, KCR, Telangana, Hyderabad Metro, Metro rail

Telangana Chief Minister K. Chandrasekhar Rao has invited Prime Minister Narendra Modi to inaugurate the first phase of the Hyderabad Metro Rail in November.

హైదరాబాద్ మెట్రోరైలు.. తొలికూతకు వేళాయరా..!

Posted: 09/07/2017 08:28 PM IST
Telangana cm invites pm modi to inaugurate hyderabad metro

హైదరాబాద్ నగరవాసులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు త్వరలో అందుబాటులోకి రానుంది. నగరవాసుల నిరీక్షణ ఫలించిన క్షణం అసన్నమైంది. ఏకంగా నాలుగువందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరంలో తొలిసారిగా మెట్రో రైలు తొలికూత పెట్టేందుకు సిద్దమవుతుంది. గత కొన్నేళ్లుగా పనులు జరుగుతున్న మెట్రోరైలు ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. పలు వాయిదాల నేపథ్యంలో ఎప్పుడెప్పుడు మెట్రోలో ప్రయాణిస్తామా..? అన్న నగరవాసి నీరీక్షణకు నవంబర్ 28 ముహూర్తం కుదిరింది.

అదే రోజున హైదరాబాద్ నగరానికి విచ్చేయనున్న ప్రధాని నరేంద్రమోడీ.. లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించి అందులో కొంతదూరం మేర ప్రయాణించనున్నారు. ఈ మేరకు నవంబర్ 28న మెట్రో రైలు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ మేరకు ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఆ లేఖను పోస్ట్ చేస్తూ మెట్రో ప్రారంభోత్సవ ముహూర్తాన్ని ధ్రువీకరించారు. నాగోలు నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మెట్రోను ప్రారంభించాల్సిందిగా ప్రధానికి సీఎం లేఖ రాశారని కేటీఆర్ తెలిపారు.
 
మెట్రో రైలును ప్రారంభించాల్సిందిగా ప్రధాని మోదీని ఈ ఏడాది మే 25న సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించినట్లు కేటీఆర్ ట్వీట్ చేసిన లేఖలో ఉంది. రూ. 15,000 కోట్ల వ్యయంతో పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంలో అతిపెద్ద ప్రాజెక్టుగా హైదరాబాద్‌ మెట్రోరైలును ప్రతిష్టాత్మకంగా చేపట్టామని తాజా లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘నవంబర్‌ 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సదస్సును ప్రారంభించడానికి ఒప్పుకున్న మీరు.. ఇదే పర్యటనలో భాగంగా మెట్రోరైలును కూడా ప్రారంభించాలర’’ని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం కేసీఆర్ ఆ లేఖలో కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Narendra Modi  Hyderabad  Hyderabad Metro  Chandrasekhar rao  KCR  

Other Articles