Telangana Tspsc to give notification for 8452 teacher posts తెలంగాణ డీఎస్సీలో 8,452 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

Telangana tspsc to give notification for 8452 teacher posts

TSPSC, Teacher posts, governments schools, panchayati raj schools, social welfare departments, finance ministry, legal affairs ministry, chakrapani ganta, teachers notification, old districts, new districts, Telangana chief minister, KCR, Telangana

Telangana TSPSC to give notification to fill 8452 Teacher Posts in various governments and panchayati raj schools of telangana, as finance ministry has given its nod.

తెలంగాణ డీఎస్సీలో 8,452 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

Posted: 09/08/2017 09:40 AM IST
Telangana tspsc to give notification for 8452 teacher posts

ఉపాధ్యాయ అశావహులు గత కొన్నేళ్లేగా ఎంతో అసక్తితో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ కు ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో 8,452 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులను జారీ చేస్తూ.. వాటికి సంబంధించిన వివరాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపించింది. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యా ఆశావహులకు శుభవార్త అందినట్లైంది.

కాగా ఉపాద్యాయ ఉద్యోగ అశావహులు తొలినుంచి కోరుకున్నట్లుగానే పాత జిల్లాల ప్రాతిపదికనే ఈ ఉపాధ్యయ పోస్టులు భర్తీ కానున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పుడు, ఆ మేరకు సంఖ్య, పేర్లు పొందుపర్చి ఉన్న కారణంగా సదరు ఉత్తర్వులను రద్దు చేయకుండా కొత్త జిల్లాల పరిధి ప్రకారం ఖాళీల భర్తీ సాధ్యం కాదని న్యాయశాఖ కూడా సలహా ఇవ్వడంతో ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో అడ్వకేట్‌ జనరల్‌ సలహా తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యయ పోస్టులను భర్తీని చేపట్టాలని యోచిస్తే.. కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోస్టులు, మరికొన్ని జిల్లాల్లో తక్కువ ఖాళీలు ఉన్నాయి. ప్రత్యేకించి రూరల్‌ జిల్లాల్లో ఎక్కువ ఖాళీలు, అర్బన్ జిల్లాల్లో తక్కువ ఖాళీలు ఉండే అవకాశం ఏర్పడుతుంది. దీంతో అలాంటి వత్యాసాలతో అశావహులకు అన్యాయం జరగకుండా పాత జిల్లాల ప్రతిపదికనే ఉపాధ్యయ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు ఇప్పటికే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి విన్నవించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  TSPSC  Teacher posts  K.Chandrasekhar rao  KCR  Ganta Chakrapani  

Other Articles