TRS MLA Ramesh no longer an Indian టీఆర్ఎస్ కు కేంద్రం జలక్.. ఎమ్మెల్యే పౌరసత్యంపై క్లారిటీ

Hma states telangana mla chennamaneni ramesh is not an indian citizen

Chennamaneni Ramesh, TRS, supreme court, MHA, irma thomson reuters eikon, Election Commission, ANZ, Vemulawada TRS legislator, Union ministry of home affairs, Union home ministry, Telangana,Karimnagar, C Vidyasagar Rao

Vemulawada TRS legislator Chennamaneni Ramesh suffered a jolt when the Union ministry of home affairs (MHA) ruled that his claim for Indian citizenship is not sustainable.

టీఆర్ఎస్ కు కేంద్రం జలక్.. ఎమ్మెల్యే పౌరసత్వంపై క్లారిటీ

Posted: 09/06/2017 10:48 AM IST
Hma states telangana mla chennamaneni ramesh is not an indian citizen

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు కేంద్రం జలక్ ఇచ్చింది. అటు నోట్ల రద్దు నుంచి తాజాగా ముగిసిన ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు కేంద్రం నిర్ణయాలకు తలొగ్గి వాటిని కొనియాడుతూ వచ్చిన ప్రభుత్వానికి కేంద్రం జలక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం చెల్లదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. చెన్నమనేని రమేశ్ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు స్వయంగా అల్లుడు కావడం గమనార్హం. చెన్నమనేని రమేశ్ నిబంధనల మేరకు పౌరసత్వం తీసుకోలేదన్న కారణంతో పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లేఖ రాశారు.

జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్న రమేశ్ 2008లో భారతదేశానికి వచ్చారు. నిబంధనల ప్రకారం భారతదేశానికి వచ్చి ఏడాది గడిచిన తర్వాత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఏడాదిలోపే 2008 చివర్లో దరఖాస్తు చేసుకున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పౌరసత్వాన్ని మంజూరు చేసింది. 2009లో టీడీపీ తరఫున వేములవాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ మీద గెలుపొందారు. రమేశ్‌ పౌరసత్వం చెల్లదని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని శ్రీనివాస్‌ 2010లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు 2013 ఆగస్టు 14వ తేదీన తుది తీర్పు ఇచ్చింది.

నిబంధనల ప్రకారం పౌరసత్వాన్ని తీసుకోలేదని, పౌరసత్వం చెల్లదని తేల్చిచెప్పింది. ఓటర్ల జాబితా నుంచి రమేశ్‌ పేరును కూడా తీసేయాలని ఆదేశించింది. తీర్పును సవాలు చేస్తూ అదే ఏడాది చెన్నమనేని రమేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొదట్లో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు 3 నెలల పాటు స్టే విధించింది. 3 నెలల గడిచిన తర్వాత తిరిగి విచారణ ప్రారంభించింది. ఆ లోగా 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి అయిన ఆది శ్రీనివాస్‌పై పోటీ చేసి చెన్నమనేని మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 
గతఏడాది ఆగస్టు 11న ఈ కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరిస్తూ... భారత పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్‌ 10, సెక్షన్‌ 17 ప్రకారం తనపై ఎందుకు చర్యలు తీసుకోరాదంటూ చెన్నమనేని రమేశ్ కు షోకాజ్‌ నోటీసులు జారీచేసి, పౌరసత్వంపై మూడు నెలల్లోనే తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల గడువులోగా కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపించలేదు. దాంతో ఈ ఏడాది ఆగస్టు 25న ఆది శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేయడంతో దానిని విచారించిన న్యాయస్థానం ఆరు వారాల్లో చెన్నమనేని పౌరసత్వంపై తేల్చేయాలని అదేశాలు జారీ చేయడంతో.. కేంద్ర హోంశాఖ చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం చెల్లదని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles