Journalist Gauri Lankesh Shot At Bengaluru Home ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ కాల్చివేత..

Gauri lankesh journalist and activist killed hired killers suspected

Gauri Lankesh, journalist gauri lankesh shot dead, activist gauri lankesh murdered, Victoria Hospital, Ramalinga Reddy, press club of india, indian women 's press corps, Narendra Dabholkar, Kavitha Lankesh, indian institute of mass communication, new delhi, siddaramaiah, Bangalore

Karnataka Chief Minister Siddaramaiah said three police teams have been formed to investigate the murder of journalist Gauri Lankesh.

ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య..

Posted: 09/06/2017 10:04 AM IST
Gauri lankesh journalist and activist killed hired killers suspected

కత్తి కన్నా కలం గోప్పదని మరోమారు రుజువైంది. తన పదునైన అక్షరాలతో అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టించిన ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మత సామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేష్ దారుణహత్య ఈ విషయాన్ని చాటిచెప్పింది. అమె అక్షరాలను కబళించే ధైర్యంలేని పిరికి పందలు అమెపై తుపాకీ తూటాల వర్షం కురిపించారు. బెంగళూరు రాజరాజేశ్వరినగరలోని తన నివాసంలో  ‘తాగడానికి నీరు కావాలి’ అంటూ అమెను సమీపించిన గుర్తు తెలియని దుండగులు అమెపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు.

మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు 5 అడుగుల దూరం నుంచి మొత్తం ఏడు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసు అధికారులు వెల్లడించారు. రాత్రి సుమారుగా ఎనమిది గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మూడు తూటాలు ఆమె నుదురు, మెడ, ఛాతీలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. మిగిలిన తూటాలు గోడకు తాకాయి. మరణోత్తర పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

తండ్రి నుంచి వారసత్వంగా అందుకున్న పత్రికా రంగంలో రాణిస్తునే.. ఆయన తనకిచ్చిన ఇంట్లోనే గౌరీ లంకేష్‌ హతమయ్యారు. వివాహిత అయిన ఆమె కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్నారు. మహారాష్ట్రలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దుండగుల తూటాలకు బలైన నరేంద్ర దబోల్కర్‌, ధార్వాడలో సాహితీవేత్త ఎం.ఎం.కలబురగి హత్యల తరహాలోనే గౌరీ లంకేష్‌ హత్యకు గురి కావడం గమనార్హం. తన ప్రాణాలకు ముప్పుందని ఆమె ముందే వూహించారు. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులతో కూడా చెప్పారు. ఇంతలోనే ఆమె హత్యకు గురికావడం విషాదాన్ని నింపింది.

గౌరీ లంకేష్‌ మృతి తనను కలచి వేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన.. రెండేళ్ల కిందట సాహితీవేత్త ఎం.ఎం.కలబురగి హత్య నుంచి తేరుకునే లోగానే గౌరీ లంకేష్‌ను దుండగులు హత్య చేశారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయని తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను నియమించామని, ఐజీపీ శరత్‌శ్చంద్ర నేతృత్వంలో ఈ బృందాలు పని చేయనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gauri Lankesh  journalist  activist  Victoria Hospital  press club of india  siddaramaiah  Bangalore  

Other Articles