AICTE asks institutes to regulate canteen food items ఆ క్యాంటీన్లలో ఇక జంక్ ఫుడ్ లభించదు..

Aicte asks institutes to regulate canteen food items

All India Council for Technical Education, AICTE, technical institutes, food items, canteens, junk food, cigarettes, gutkha, drugs, other intoxicants, Universities, colleges

The All India Council for Technical Education (AICTE) has asked all technical institutes to 'regulate' food items at their canteens to ensure that students do not get junk food to eat on the campus

ఆ క్యాంటీన్లలో ఇక జంక్ ఫుడ్ లభించదు..

Posted: 09/06/2017 11:33 AM IST
Aicte asks institutes to regulate canteen food items

జంక్ ఫుడ్ పట్ల అసక్తి, మక్కువను కనబరుస్తూ.. వాటిని విరివిగా లాగిస్తూ.. ఒబెసిటీ, మధుమేహం సహా ఇతర వ్యాధులకు తమ దేహాలను నిలయాలుగా మారుస్తున్న క్రమంలో కేంద్రం సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఇవి నేరుగా కేంద్రం ప్రభుత్వం ద్వారా అమల్లోకి రాకుండా బంగారు భారత్ కు బాటలు వేయాల్సిన రేపటి తరం వారిని వాటి నుంచి దూరంగా వుంచేందుకు నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా వున్న అన్ని వృత్తి విద్యా యూనివర్సిటీలతో పాటు కాలేజీల్లో జంక్‌ ఫుడ్ ను నిషేధించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్పష్టం చేస్తూ స్పష్టమైనా అదేశాలు జారీ చేసింది.

భారత సంప్రదాయక వంటకాలతో పాటు అల్పాహారాలను, ఇతర స్కాక్స్ ను కాలేజీ క్యాంటీన్లలో, ఆవరణలో ఏర్పాటు చేయాలని అదేశించింది. కాలేజీ క్యాంటీన్ల అవరణలో జంక్‌ ఫుడ్‌ను విక్రయించడానికి, వండటానికి వీల్లేదని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ నిబంధనను తమ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, మేనేజ్‌మెంట్ కాలేజీ యాజమాన్యాలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది. కాలేజీల ఆవరణలో విక్రయించే ఆహార పదార్థాలను యాజమాన్యాలే నియంత్రించాలని అదేశాలను జారీ చేసింది.

ఇక వృత్తివిద్యా కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు భారతీయ వంటకాలపై మక్కువను పెంచేలా యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఇకపై  ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, మేనేజ్‌మెంట్ విద్యార్థులు జంక్ ఫుడ్ ను తినకుండా చూడాల్సిన బాధ్యత కాలేజీలదేనని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 10 వేల కాలేజీల్లో ఈ నిబంధనల అమలుకు యాజమాన్యాలు వెంటనే చర్యలు చేపట్టాలని ఏఐసీటీఈ సూచించింది. దీనిని రాష్ట్రంలో 500కు పైగా ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, నర్సింగ్ కాలేజీ యాజమాన్యాలు అన్నీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.

ఇక ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, నర్సింగ్ కాలేజీల ఆవరణలో సిగరెట్, గుట్కా, డ్రగ్స్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించింది ఏఐసీటీఈ. వీటి వినియోగంతో ఏర్పడే అనారోగ్యం సమస్యలపై విద్యార్థులలో అవగాహన కల్పించాలని ఇందుకోసం ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయాలని కూడా సూచనలు చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పదార్థాలు కాలేజీల ఆవరణలో ఉండటానికి వీల్లేకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. కాలేజీల్లోని ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల నేతృత్వంలో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles