amrutha claims to be the daughter of jayalalithaa కొడుకు స్టోరీ ముగిసింది.. ఇక తెరపైకి ‘అమ్మ’ కూతురు..

Amrutha claims to be the daughter of jayalalithaa

amrutha, J Jayalalithaa, Sasikala, sobhanbabu, jayalalitha daughter, jaya and sobhanbabu, jaya, amrutha jaya daughter, sailaja, Kengeri, Bengaluru, PM Modi, Ramnath Kovind

Joining the controversy about who would own what of the late chief minister's property, and now joining the controversy is Jayalalithaa's estranged younger sister's daughter Amrutha who lives in Kengeri on the outskirts of Bengaluru.

కొడుకు స్టోరీ ముగిసింది.. ఇక తెరపైకి ‘అమ్మ’ కూతురు..

Posted: 08/30/2017 12:01 PM IST
Amrutha claims to be the daughter of jayalalithaa

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత,, తమిళ ప్రజల అమ్మ మరణానంతరం తమిళనాడు ఇటు రాజకీయాలే కాదు అటు.. అమె వారసులమంటున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతానే వుంది. ఇప్పటివరకు జయ సోదరుడి కుమార్తె. కుమారుడు దీపా, దీపక్ లు మాత్రమే వారసులని భావిస్తున్న తరుణంలో.. అమ్మ మరణానంతంర అమె ప్రతిష్టను భంగపర్చేందుకు ఇటీవల ఓ కోడుకు వచ్చాడు. తను జయలలిత కొడుకు అంటూ గగ్లోలు పెట్టాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఏకంగా తనకు న్యాయం చేయాలంటూ కోర్టుకు ఎక్కాడు.

కోర్టులో ఆ మేరకు పిటిషన్ వేసిన కోడుకు.. తాను జయలలిత, శోభన్ బాబులకు పుట్టాను అని అతడు వాదించాడు. అయితే అతడు సమర్పించిన ఆధారాలన్ని అతను చెబుతున్న దానికి భిన్నంగా వుండటంతో.. అతనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్థం లేని ఆధారాలను చూపించి.. కోర్టు సమయాన్ని వ్యర్థం చేసినందుకు అతడిని న్యాయస్థానం దండించి పంపించింది. ఈ స్టోరీ అలా ముగిసిందో లేదో.. ఇప్పుడు తెరపైకి జయలలిత కుమార్తె వచ్చింది. తాను నిజంగానే జయలలితకు వారుసరాలనినని నమ్మబలుకుతుంది.

నటుడు శోభన్‌బాబు, జయలలిత ప్రేమకు తీపి గురుతు నేను. కావాలంటే డీఎన్ఏ పరీక్ష చేయించుకోండి’’ అంటూ అమృత అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. తన కన్నతల్లిది సహజ మరణం కాదని, నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌లకు ఆమె రాసిన లేఖలు తాజాగా వెలుగుచూశాయి.  మాజీ ముఖ్యమంత్రి జయలలిత నా కన్నతల్లి. జయలలిత తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో శోభన్‌బాబు అండతో కోలుకుంది. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. కూడా చెబుతుంది.

జయలలిత, శోభన్ బాబుల ప్రేమాప్యాయలతకు తీపిగుర్తును తానేనంటుంది. అయితే వివిధ కారణాల వల్ల వివాహం చేసుకోని అమ్మ తనను పెంచడానికి కూడా అలోచించిందని.. దీంతో తనను చిన్నమ్మ (జయ సోదరి) శైలజ, భర్త సారథిలకు అప్పగించారని చెప్పింది. అయితే తాను ఎవరన్న విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్నమ్మ, చిన్నాలతో ఒట్టు వేయించుకుందని దీంతో వారే తన తల్లిదండ్రులుగా పెరుగుతూవచ్చాని అమృత చెప్పింది. 1996లో శైలజ సూచన మేరకు జయను కలిశానని, అప్పుడే అమె తన వివరాలు తెలుకుని.. తనను ఒక్కసారిగా హత్తుకున్నారిని అమృత చెబుతుంది.

అయితే ఆమె నా తల్లి అన్న విషయాన్ని ఆమె ఎప్పుడూ చెప్పలేదు’’ అని లేఖలో పేర్కొన్నారు. జయ మరణం తర్వాత దీప, దీపక్‌లు మీడియా ముందుకొచ్చి తామే జయ వారసులమని చెప్పడం తనను బాధించిందన్నారు. తన తల్లి మరణం వెనక శశికళ, నటరాజన్‌ల పాత్ర ఉందని, ఈ విషయంలో నిజాల నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. అమృత లేఖ తమిళనాడులో పెను సంచలనానికి కారణమైంది. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకు అమృత గురించే చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amrutha  J Jayalalithaa  Sasikala  sobhanbabu  jayalalitha daughter  PM Modi  Ramnath Kovind  

Other Articles