Swaraj kushal denies marital rape in india భార్యభర్తల మధ్య బలవంతపు శృంగారం నేరం కాదు..

Central government thinks marital rape cannot be criminalised

Sushma Swaraj, Swaraj Kaushal, marital rapem twitter, ex governor, mizoram, marital rape, criminalisation marital rape, criminalise marital rape, central government, government, delhi high court

Section 375 of the IPC dealing with rape makes an exception for such instances within marriages and holds that “sexual intercourse by a man with his own wife, the wife not being under 15 years of age, is not rape”

భార్యభర్తల మధ్య బలవంతపు శృంగారం నేరం కాదు..

Posted: 08/30/2017 11:17 AM IST
Central government thinks marital rape cannot be criminalised

భారతీయ వైవాహిక సంస్కృతిలో భార్యభర్తల అనుబంధం, అన్యోన్యతను ప్రపంచ దేశాలు శ్లాఘిస్తున్న తరుణంలో పలు దేశాలలో వున్న మారిటల్ రేప్ ను భారతీయ వివాహ చట్టానికి కూడా అనుసంధానం చేయడం ద్వారా.. వివాహ వ్యవస్థకు బీటాలు వారే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత హిందూ వివాహ చట్టంలో ఇప్పటికే వున్న పలు చట్టాల అనుసంధానం ద్వారా భార్యలు భర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. వివాహ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేస్తున్నారని కేంద్రం తరుపున ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తన వాదనలను వినిపించారు.

మారిటల్ రేప్ భారతీయ వివాహ చట్టానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సరపడదని, దీనిని కూడా జోడించిన పక్షంలో.. దాని ప్రభావం యావత్ వివాహ చట్టంపైబడి.. పవిత్రమై వివాహ వ్యవ్యస్థను కుప్పకూల్చే ప్రయత్నమే అవుతుందని కేంద్రం తన వాదనను బలంగా వినింపించింది. భార్య అంగీకారం లేకుండా భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా ఎందుకు పరిగణించకూడదన్న ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. దీనిపై కేంద్రం తన వాదన వినిపించింది. భార్యభర్తల మధ్య శృంగారానికి ఇద్దరి సమ్మతం కావాలని కోరడం అక్షేపనీయమని పేర్కోంది.

భార్య అంగీకారం లేకుండా భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని కేంద్రం స్పష్టం చేసింది. దీనిని నేరంగా పరిగణిస్తే భార్యలు భర్తలపై కక్ష సాధింపులు, వేధింపులకు ఆయుధంగా మార్చుకునే ప్రమాదం ఉందని కేంద్రం చెప్పింది. ఇందుకు ఐపీసీ సెక్షన్ 498(ఏ)ను ఉదాహరణగా చూపింది. ఈ విషయంలో ఎలాంటి సంక్లిష్టతకు తావివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రతివాదులుగా చేర్చాలని కోరింది. రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకుని, ఆ తరువాత దీనిపై స్పష్టతకు రావాలని సూచించింది. వైవాహిక రేప్ ను చట్టంలో నిర్వచించలేదని, దీనిని నిర్వచించేందుకు సమాజంలో విస్తృత ఏకాభిప్రాయం అవసరమని స్పష్టం చేసింది.  

కాగా, వైవాహిక అత్యాచారంపై మాజీ గవర్నర్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. వైవాహిక అత్యాచారంపై ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో వైవాహిక అత్యాచారం ఎక్కడుంది? అని ప్రశ్నించారు. వైవాహిక అత్యాచారం వంటిదేమీ లేదని ఆయన చెప్పారు. ప్రతి పౌరుడి నివాసం జైలు కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం మొదలు పెడితే భర్తలు ఇళ్లలో ఉండరని, జైళ్లలోనే ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, భార్య అంగీకారం లేకుండా భర్త శృంగారంలో పాల్గొనడాన్ని వైవాహిక అత్యాచారం అంటారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles