Sasikala allowed to step out of jail..? జైలు నుంచి శశికళ బయటకు వెళ్లిందా..? వీడియో కలకలం..

Was jailed sasikala allowed to step out video footage suggests so

Sasikala, video, D Roopa, special treatment, VIP treatment, Sasikala went out of jail, Ilavarasi, video of sasikala, d roopa, ACB, Parappana Agrahara Central Prison CCTV footage, main entrance, civil clothes, Bengaluru, Karnataka

The CCTV footage of Parappana Agrahara Central Prison in Bengaluru is raising questions whether Sasikala and Ilavarasi were allowed to walk out of the prison by officials.

ITEMVIDEOS: జైలు నుంచి శశికళ బయటకు వెళ్లిందా..? వీడియో కలకలం..

Posted: 08/21/2017 03:49 PM IST
Was jailed sasikala allowed to step out video footage suggests so

అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రదాన కార్యదర్శిగా కొనసాగుతున్న వికే శశికళకు బెంగళూరులోని పరప్పనా అగ్రహార కేంద్ర కారాగారంలో నిజంగానే రాజభోగాలు లభిస్తున్నాయా..? అంటే అవునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు జైలులోని ఉన్నతాధికారులకు రెండు కోట్ల మేర అందాయని స్వయంగా అదే జైలులో విధులు నిర్వహిస్తున్న జైలు శాఖ డీఐజీ డి రూపా అరోపణలు చేశారు. అయితే వాటిని జైలు అధికారులు ఖండించినా.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం అధికారులను బదిలీ చేసి.. ఘటనపై విచారణకు అదేశించారు.

తాజాగా మరో వీడియో వెలుగుచూడటంతో నిజంగానే శశికళకు జైలులో రాచమర్యాదలు జరిగాయన్న వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. అమెను ఎప్పుడు కావాలంటే అప్పడు, ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్లే స్వేచ్ఛను, స్వతంత్ర్యాన్ని కూడా అధికారులు కల్పించారన్న విమర్శలు కూడా ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఇందుకు సంబంధించిన జైలు ప్రధాన మార్గంలోని రికార్డయిన సిసిటీవీ ఫూటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

నల్లరంగు కుర్తా వేసుకొని చేతిలో బ్యాగు పట్టుకొని శశికళ.. బయటి నుంచి అగ్రహార జైలులోకి దర్జాగా వస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో చిక్కుకోవడమే అవి వైరల్ కావడానికి కారణమైయ్యాయి. దేశ సర్వన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శశికళకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల  జైలుశిక్ష విధించింది. అయితే, రూ. రెండు కోట్ల మేర లంచాలను ఉన్నాతాధికారులకు చెల్లించి.. జైలులో శశికళ రాజభోగాలు అనుభవిస్తోందని జైళ్లశాఖ డీఐజీ డీ రూప ఆరోపించారు. కాగా ఈ ఘటనలపై ప్రభుత్వం విచారణకు అదేశఇంచడంతో.. రూపా తన ఆరోపణలను సాక్ష్యంగా జైలు ప్రవేశద్వారంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలను ఏసీబీకి సమర్పించారు.

సాధారణ దుస్తుల్లో శశికళ జైలు లోపలికి దర్జాగా వస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. ఆమెకు రక్షణగా ఇద్దరు పురుష గార్డులు కూడా ఉన్నారు.శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారని ఆరోపించిన డీ రూపను కర్ణాటక ప్రభుత్వం బదిలీచేసిన సంగతి తెలిసిందే. జైళ్ల శాఖ నుంచి ఆమెను తప్పించి బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ బాధ్యతలను అప్పగించింది. జైలులో శశికళకు రాజభోగాల వ్యవహారంపై ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సీసీటీవీ కెమెరా దృశ్యాలను డీ రూప సమర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sasikala  video  D Roopa  special treatment  Parappana Agrahara jail  Bengaluru  

Other Articles