nandyal dsp transferred on favours to ruling party నంద్యాల డీఎస్పీపై బదిలీ వేటు.. అందుకనేనట..

Nandyal dsp transferred on favours to ruling party

tdp, nandyal, nandyal bypoll, dsp, ysr congress, Gopal Krishna, YSRCP, Election Commission, Chandrababu government, Andhra Pradesh, Nandyal, politics

Responding on the complaints of the opposition party, and taking reports from observers EC has confirmed that that Nandyal DSP Gopalkrishna was taking all actions in favour of ruiling party, and has taken disciplinary action by transfering him.

నంద్యాల డీఎస్పీపై బదిలీ వేటు.. అందుకనేనట..

Posted: 08/19/2017 01:56 PM IST
Nandyal dsp transferred on favours to ruling party

కర్నూలు జిల్లా నంద్యాలలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఓ వైపు ప్రశాంత్ కిషోర్ పై కేసు పెడతామన్న లీకుల నుంచి తాజాగా నంద్యాల డీఎస్సీపై బదిలీ వేటు వరకు అంతా చర్చనీయాంశమే. ఈ పరిణామాలతో అప్పుడే అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయా.? అన్న విధంగా వాతావరణాన్ని మర్చేసింది. ఈ ఎన్నికలను అధికార టీడీపీ, విపక్ష వైఎస్సార్ సిపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలలో పరస్పర దూషణలు, అరోపణలు, విమర్శలే కాకుండా వ్యూహాత్మక దాడులు కూడా కొనసాగుతున్నాయి.

ఎన్నికల నోటిపికేషన్ విడుదలైన నాటి నుంచి ఈ రెండు వర్గాల నేతలు, కార్యకర్తలు మొదలు అన్ని స్థాయిలలో వైరంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పరస్పరం ఎన్నికల కమీషన్ అధికారులకు పిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విపక్షానికి చెందిన వైఎస్సార్ సిపీ పార్టీకి చెందిన దిగువ శ్రేణి నాయకులను బెదిరించి. ప్రలోభాలకు గురి చేసి వారిని తమ వెంట తీసుకెళ్లేందుకు అధికార పార్టీ వ్యూహాలు రచిందిందని కూడా విఫక్షం అరోపణలు చేసింది.

ఇక ఇటు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుని అధికార టీడీపీ.. తమ పార్టీకి చెందిన నాయకులను టార్గెట్ చేస్తున్నారని విపక్షానికి చెందిన పార్టీ నేతల నుంచి పిర్యాదులు వెల్లువెత్తడంతో..  ఎన్నికల కమీసన్ స్పందించింది. విపక్ష సభ్యులతో పాటు ఎన్నికల అబర్వర్లు నుంచి కూడా నివేదికలను తీసుకున్న తరువాత ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి.. వారి అదేశాల ప్రకారం నంద్యాల డీఎస్సీ గోపాల కృష్ణపై సప్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చిన్నాచితకా నాయకుల ఇళ్లపై అర్థరాత్రి సోదాలు అంటూ తలుపు తడుతూ డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చేసిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుని అతనిపై చర్యలను తీసుకుంది. గోపాలకృష్ణ స్ధానంలో ఓఎస్‌డీ రవిప్రకాశ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈసీ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముగ్గురు పరిశీకులను ఈసీ నియమించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopal Krishna  YSRCP  Election Commission  Chandrababu government  Andhra Pradesh  Nandyal  politics  

Other Articles