indian epics to be electives in howard university మన ఇతిహాసాలు అక్కడ తరగతి పాఠాలు..!

Indian epics to be the subjects in howard university from next academics

Harvard University, Harvard university courses, Harvard University Fall 2017 courses, Harvard University on Hinduism, Mahabharata, Ramayana, Course on Indian Epics, course on hinduism, course on hindu epics, Hinduism

indian epics Ramayana, mahabharatam and bhaghavatam to be the subjects in howard university from next academics says southasian religous and regional lecturer.

మన ఇతిహాసాలు అక్కడ తరగతి పాఠాలు..!

Posted: 08/19/2017 12:11 PM IST
Indian epics to be the subjects in howard university from next academics

భారత దేశానికి మర పదంగా హిందుస్తాన్.. ఆ దిశగా యావత్ ప్రపంచం గుర్తించే దిశగా అడుగులు సాగుతున్నాయి.  భారతీయులు మరీ ముఖ్యంగా హిందువులు అత్యంత ప్రవిత్రంగా భావించే రామాయణం, మహాభారత ఇతిహాసాలను ఇక పాఠ్యాంశాలుగా మారనున్నాయి. ఎప్పటి నుంచో మన ఇతిహాసాలను మన విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోదిస్తున్నారుగా అని అంటారా..? అవునండీ మన ఇతిహాసాల్లోన్ని కొన్ని అంశాలను మాత్రమే మన విద్యార్థులు పాఠ్యాంశాలుగా నేర్చకుంటున్నారు.

కానీ పూర్తి ఇతిహాసాన్ని నేర్చుకోవాలంటే ఇక పురాణ గ్రంధాలను తీసి చదువుకోవాల్సిందే. అయితే ఏమైనా సందేహాలు ఉత్పన్నమైతే మాత్రం.. పండితులను, ఆచార్యులను మాత్రం అడగక తప్పదు. దేశీయ విద్యార్థులకే కాకుండా అగ్రరాజ్యవాసులకు కూడా ఇకపై మన ఇతిహాసలు పాఠ్యాంశాలుగా మారనున్నాయి. తొలిసారిగా ఈ అవకాశం అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివ‌ర్సిటీ దక్కించుకోనుంది. రానున్న విద్యా సంవ‌త్స‌రం నుంచి  రామాయ‌ణ‌, మ‌హాభార‌తాలను బోధించ‌నున్నారు.

హార్వ‌ర్డ్ విశ్వవిద్యాలయంలో ద‌క్షిణాసియా మ‌తాల అధ్యాప‌కురాలిగా ప‌నిచేస్తున్న అధ్యాప‌కురాలు యానీ ఈ మోనియ‌స్ ఈ విషయాన్ని అదికారికంగా స్పష్టం చేశారు. ‘భారతీయ మత గ్రంథాల ద్వారా రచనా సాహిత్యాల బోధన’ అనే అంశాన్ని సిల‌బ‌స్‌లో చేర్చారని, ఆధునిక మ‌త ప‌రిస్థితులకు అనుసంధానించి విద్యార్థులకు బోధిస్తారని చెప్పారు. ద్వేషం, యుద్ధం వల్ల కలిగే నష్టాలను మహాభారతం హుందాగా వివరించిందని తెలిపారు.

ఇక భారతదేశ ప్రేమ కథలు, పితృవాఖ్య పరిపాలన అంశంలో రామాయణం ఒకటని ఆమె అన్నారు. శతాబ్దానికి పైగా రామాయణ, మహాభారతాలను తాత్విక, లేఖన గ్రంథాలుగానే చాలా మంది పరిశోధకులు అధ్యయనం చేశారని ఆమె అభిప్రాయపడ్డారు. భారతీయ సాహిత్య సంపదను ఎక్కువగా విస్మరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత వీటి గొప్పదనాన్ని అభినందించకుండా ఉండలేరని యానీ ఈ మోనియ‌స్ వ్యాఖ్యానించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harvard University  Indian epics  Ramayana  Mahabharata  course on hinduism  Hinduism  

Other Articles