Kodandaram arrested in nizambad Bikkanoor ప్రోఫెసర్ సారుకు పోలీసులు పో‘దండం’

Tjac chairman kodandaram arrested in nizambad bikkanoor

kodandaram, Tjac, Bikkanoor, tensions, TRS, ruling party activists, nizambad, telangana police, telangana martyrs

Tension arose in bikkanoor as few ruling party activists protest TJac chairman kodandaram launches telangan martyrs rally in nizambad and bikkanoor

ప్రోఫెసర్ సారుకు పోలీసులు పో‘దండం’

Posted: 08/11/2017 06:02 PM IST
Tjac chairman kodandaram arrested in nizambad bikkanoor

అమరవీరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొంటున్న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ను పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. అమరవీరుల స్ఫూర్తి యాత్ర పేరుతో ఆయన చేపట్టిన యాత్రకు ముందుగా పోలీసులు అనుమతులు మంజూరు చేసినా.. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కావడంతో  ఆయనను కామారెడ్డి జిల్లా సరిహద్దు బస్వాపూర్‌ వద్ద అడ్డుకున్నారు.  కోదండరామ్ గో బ్యాక్ అంటూ అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో కోదండరామ్ తో పాటు ప‌లువురు టీజేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని బిక్కనూరు పోలీస్‌స్టేషన్ కు తరలించారు.

కోదండరామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న వార్త దవాణంలా వ్యాపించడంతో పోలిస్ స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న టీజేఏసీ నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో పోలిస్ స్టేషన్ వ‌ద్ద ఉద్రిక్త‌త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్‌స్టేషన్‌లో టీజేఏసీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెల‌రేగింది. కోదండ‌రామ్ అరెస్టును ఖండిస్తూ టీజేఏసీ కార్య‌క‌ర్త‌లు, కళాకారులు సీఎం కేసీఆర్‌కి వ్య‌తిరేకంగా పాట‌లు పాడారు. దీంతో ఇక కోదండరామ్ ను హైదరాబాద్ లోని తన నివాసానికి తరలించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.

పోలీసుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన టీజేఏసీ కార్యకర్తలు ఈ క్రమంలో కోదండరామ్ ను హైదరాబాద్ తరలించేందుకు పోలీస్‌ జీపు ఎక్కించగా జేఏసీ కార్యకర్తలు జీపుగా అడ్డంగా పడుకుని ప్రతిఘటించారు. వారిని చెదరగొట్టిన పోలీసులు కోదండరామ్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ఈ సందర్బంగా మాట్లాడిన కోదండరామ్ తమ అమరవీరుల స్ఫూర్తి యాత్ర నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. బిక్కనూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద మాట్లాడిన ఆయన ఉద్యమ ఆకాంక్షలను అమలు చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాలన్నదే తమ ఆకాంక్షని చెప్పారు. యాత్ర చేయొద్దనటం చాలా విచిత్రమైన పరిస్థితి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారని విమర్శించారు. పోలీసుల చర్య అమానుషం, అప్రజాస్వామికం అని మండిపడ్డారు. తమ యాత్రకు అనుమ‌తి ఉన్న‌ప్ప‌టికీ పోలీసులు అడ్డుకోవ‌డం ఏంట‌ని కోదండ‌రామ్ మండిప‌డ్డారు. అవినీతిని ప్రశ్నిస్తామనే పాలకులు యాత్ర‌కు ఆటంకాలు సృష్టిస్తున్నార‌ని కోదండరామ్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodandaram  Tjac  Bikkanoor  tensions  TRS  ruling party activists  nizambad  telangana police  telangana martyrs  

Other Articles