Film Nagar Ganesh to get Tapeswaram laddu ఖైరతాబాద్ గణేశుడికి బై బై చెబుతున్న తాపేశ్వరం లడ్డు..

Leaving khairathabad ganesh film nagar ganesh to get tapeswaram laddu

Leaving behing Khairathabad Ganesh, and the history of the biggest idol in hyderabad, from now onwards Film Nagar Ganesh to get Tapeswaram laddu, no tapeswaram laddu to khairatabad ganesh, biggest idol in hyderabad, khairatabad ganesh, film nagar ganesh, tapeswaram laddu, east godavari, prasadam, ganesh festival

Leaving behing Khairathabad Ganesh, and the history of the biggest idol in hyderabad, from now onwards Film Nagar Ganesh to get Tapeswaram laddu

ఖైరతాబాద్ గణేశుడికి బై బై చెబుతున్న తాపేశ్వరం లడ్డు..

Posted: 08/11/2017 04:14 PM IST
Leaving khairathabad ganesh film nagar ganesh to get tapeswaram laddu

గణేశ్ ఉత్సవాలకు పెట్టింది పేరైన ఖైరతాబాద్ వినాయకుడిని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ.. ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్దలతో.. నవరాత్రులను జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తులో వుండే గణనాధుడు విగ్రహ ఏర్పాటులతో అధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. ఈ భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించే ఈ వినాయకుడు నిమజ్ఝనం తరువాత కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరకుంటారు. ఎందుకిలా.. నవరాత్రులన్ని రోజులే కదా భక్తులు వుంటారు.. ఆ తరువాత ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు ఎందుకు చేరుకుంటారు. అంటే.

అందుకు ముఖ్యకారణం ఖైరతాబాద్ గణపయ్య చేతిలో భారీ క్రేన్ సాయంతో వుంచే లడ్డూ ప్రసాత వితరణ. అవునండీ నవరాత్రులన్ని రోజులు వినాయకుడి చేతిలో అలంకరించబడే ఈ లడ్డూ ప్రసాదాన్ని తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ప్రత్యేకంగా తయారు చేసి పంపుతారు. ఇక ఈ ప్రసాదం లభిస్తే తమకంతా శుభమే జరుగుతుందన్నది భక్తుల విశ్వాసం. దీంతో నిమజ్జనం పూర్తైన తరువా త కూడా ఈ లడ్డూ ప్రసాద వితరణ ఎప్పుడెప్పుడు జరుగుతుందా..? అంటూ భక్తులు వేచి చూస్తారు.

ఈ నమ్మకం ఏడాదికేడాది అంచెలంచెలుగా పెరుగుతూ.. భక్తులు ఒకరు నుంచి మరోకరు మహా లడ్డూ ప్రసాదం గురించి తెలుసుకుని గతేడాది ప్రసాద వితరణ నిర్వాహకులతో పాటు ఇటు పోలీసులు, అటు వాలెంటీర్లకు కూడా పరీక్షగా మారింది. ప్రసాదం కోసం వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో.. తోపులాటలు, లాఠీచార్జ్ లతో పోలీసులు, నిర్వాహకులు చెడ్డపేరు అపాదించింది పెట్టింది. దీంతో తాపేశ్వరం లడ్డూను ఇకపై ప్రసాదంగా పెట్టరాదని నిర్వాహకులు భావించారు. దీంతో ఏళ్లుగా వస్తున్న అనవాయితీకి ఇప్పుడు చెక్ పడుతుంది.

ప్రత్యేకంగా తయారు చేయించి పంపుతున్న 500 కిలోల లడ్డూను తాము ఉచితంగా అందిస్తుండగా, దానిని వితరణ చేయడంలో విఫలమై.. ఇక ఈ ప్రసాదం వద్దూ అని నిర్వాహకులు చెప్పడం.. లడ్డూ ప్రసాదం స్థానంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన లడ్డూను స్వామి చేతిలో అలంకరిస్తామని గణేష్ ఉత్సవ కమిటీ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఇక ఈ లడ్డూను హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని గణేషుడి చేతిలోకి వెళ్లనుంది. ఈ మేరకు సురుచీ స్వీట్స్ సంస్థ యజమాని పోలిశెట్టి మల్లిఖార్జున రావు సన్నిహిత వర్గాల సమాచారం.

దీంతో హైదరాబాద్ వినాయకుడికి తాము పంపే లడ్డూను ఇకపై ఫిల్మ్ నగర్ వినాయకుడు అందుకునేలా చేయనున్నారు. ఫిలింనగర్ లో ప్రతిష్ఠింపబడే వినాయకుడికి 500 కిలోల మహాలడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్టు ఆయన స్వయంగా తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఉండే నవరాత్రుల పాటు పూజలందుకుని ఆ తరువాత భక్తుల కొంగుబంగారం కానున్న ఈ లడ్డూ ప్రసాదం ఇకపై ఫిల్మ్ నగర్ గణేషుడికి చేతిని అలంకరించనుంది. దీంతో పాటుగా తెలంగాణ భవన్ పక్కనే ఉన్న పూరీ జగన్నాథాలయానికి 100 కిలోల లడ్డూను ఇవ్వనున్నామని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles