Prof asks Iranian student for sex in return for college seatకోరిక తీరిస్తేనే పీహెచ్డీ సీటు.. ఇరానీ యువతి పిర్యాదు

Professor seeks sexual favours from iranian woman for phd seat

Pune, sexual offience, Pune college, professor, Iranian woman, PhD in accounts, sexual favours, maharastra police, crime, borhade, sangvi investigating, Sangvi, Raghunath Phuge, payal panchbhai, Nikhil Ghorpade, Kothrud PS, Kothrud, Iran, borhade

"The professor told her there was only one seat available in the course and two applications. He promised to help her get admission in the PhD course," senior police official said.

కోరిక తీరిస్తేనే పీహెచ్డీ సీటు.. ఇరానీ యువతి పిర్యాదు

Posted: 08/11/2017 02:42 PM IST
Professor seeks sexual favours from iranian woman for phd seat

ఇప్పటికే దేశంలో పర్యటిస్తున్న విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గింది. దేశంలో మహిళలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో నమోదవుతున్న కేసులు సంఖ్య కూడా అంతకంతకూ పెగుతుంది. ఈ క్రమంలో మన దేశ పర్యటనకు వచ్చే వారికి విదేశాలు ఏకంగా హెచ్చరికలు చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న క్రమంలో ఇలాంటి అపఖ్యాతులను దూరం చేయడంతో తమ వంతు పాత్రను పోషించాల్సిన ప్రొఫెసర్లు ఏకంగా విదేశీ వనితనే తన కామవాంఛ తీరుస్తే అమె కోరిక నేరవేస్తానని చెప్పడం ఎంత దారుణం.

దేశం కానీ దేశం నుంచి ఉన్నత చదువుల కోసం భారతదేశానికి వచ్చిన 31 ఏళ్ల ఇరానీ మహిళకు ఈ పరిస్థితి ఎదురైంది.  సాక్షాత్తూ ఓ ప్రొఫెసరే ఆమెతో తన కోరిక తీరిస్తే పీహెచ్‌డీ సీటు ఇస్తాననడంతో అమె నిర్ఘాంతపోయింది. అకౌంట్స్ లో పీహెచ్డీ చేనేందుకు భారత్ వచ్చిన ఇరానీ వనితకు ఇదే జరిగింది. ఇందుకోసం ఇరాన్ నుంచి మహారాష్ట్రలోని ఫూణేకు చేరకుంది. పూణే నగరంలో స్థానికంగా గల యశ్వంతరావు మొహితే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్సు అండ్ కామర్స్ కళాశాలకు వచ్చింది. తనకు  పీహెచ్డీ సీటు ఇవ్వాలని ప్రొఫెసర్ శివాజీ బొర్హాడే (53) ని కోరింది.

తనతో లైంగిక సంబంధం పెట్టుకొని తన కోరిక తీరిస్తే పీహెచ్డీ సీటు ఇస్తానని ప్రొఫెసర్ సెలవియ్యడంతో ఆ ఇరాన్ మహిళ షాక్‌కు గురైంది. వెంటనే ప్రొఫెసర్ గదిలోనుంచి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్లిన ఇరాన్ మహిళ స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి తన కోరిక తీర్చమన్న ప్రొఫెసరుపై పూణే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రొఫెసరు శివాజీ బొర్హాడే పై ఐపీసీ సెక్షన్ 354 (ఎ) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడైన శివాజీ బొర్హాడే తన నేరాన్ని అంగీకరించి క్షమాపణలు చెప్పాడు. కళాశాలలో సీనియర్ ప్రొఫెసర్ అయిన శివాజీ బొర్హాడే ఇద్దరు అమ్మాయిలకు తండ్రి అయి ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రొఫెసర్ తీరుపై పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles