Hyderabad Police Arrested Drug Dealer Gabriel డ్రగ్స్ పెడ్లర్ గ్యాబ్రియల్ అరెస్టు.. కొనసాగుతున్న సోదాలు..

Hyderabad task force police arrested drug dealer gabriel

drugs case main accused gabriel arrested, searches in nigerian houses, searches in somalian houses, mian accused, gabreil, nigerian, drugs, hyderabad, rachakonda police, nigerians, drug peddlers, somalians, crime

Hyderabad Task Force Police Arrested Drug Dealer Gabriel and seized Laptop and Cocaine from his house, Rachakonda police search operation in nigerians house.

డ్రగ్స్ పెడ్లర్ గ్యాబ్రియల్ అరెస్టు.. కొనసాగుతున్న సోదాలు..

Posted: 08/10/2017 12:17 PM IST
Hyderabad task force police arrested drug dealer gabriel

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు గాబ్రియేల్ ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కౌకూర్ ప్రాంతంలోని యాప్రాల్ లో చిక్కిన గాబ్రియేల్ నుంచి  కొకైన్‌, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో అత్యంత కీలకంగా మారిన ఆయన ల్యాప్ టాప్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ డ్రగ్స్ రాకెట్‌లో గాబ్రియేల్ కీలక నిందితుడు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాదులోని డ్రగ్స్ పెడ్లర్లకు గాబ్రియేల్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

రెండేళ్ల బిజినెస్‌ వీసాపై హైదరాబాదుకు గాబ్రియేల్ వచ్చడని గుర్తించిన పోలీసులు.. అయన గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడని, అయితే బెయిల్ పై బయటకు వచ్చిన అతను తన పద్దతిని మార్చుకోకుండా మళ్లీ డ్రగ్స్ సరఫరా చేస్తూన్నాడని గుర్తించారు.  వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే అతడు వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ఈ సారి కేవలం గాబ్రియేల్ ను మాత్రమే కాకుండా అతడు పోలీసుల నుంచి తప్పించుకు తిరగడానికి సహకరిస్తున్న అతడి ప్రియురాలిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు హైదరాబాద్‌, సైబరాబాద్‌ రాచకొండ పరిధిలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అసిఫ్ నగర్, రాజేంద్రనగర్, బండ్లగూడ సహా నగరంలోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. నైజీరియన్లు, సోమాలియా దేశస్థులు ఉంటున్న ప్రాంతాలను గుర్తించి.. వారి ఇళ్లపై ఏకకాలంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వీసా గడువు ముగిసినా.. ఇంకా హైదరాబాద్ నగరంలోనే తిష్ట వేసిన వారిన గుర్తించే పనిలో వున్నారు. వీరితో పాటు డ్రగ్ పెడ్లర్లుగా మారిన వారి వివరాలను కూడా గుర్తిస్తున్నారు. హైదరాబాదులో 6 వేలకుపైగా, సైబరాబాద్ రాచకొండ పరిధిలో 4 వేల మందిపైగా నైజీరియన్లు ఉన్నట్టు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mian accused  gabreil  nigerian  drugs  hyderabad  rachakonda police  nigerians  drug peddlers  somalians  crime  

Other Articles