మీకు పాన్ కార్డు వుందా..? అయితే దానిని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకున్నారా..? లేదా..? తక్షణం మీరు మీ పాన్ కార్డు యాక్టివ్ గా వుందా..? లేదా అన్న విషయాన్ని ముందుగా చూసుకోండి. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా 11.44 లక్షల పాన్ కార్డులు పనికిరాకుండా (డీయాక్టివేట్) చేసేసింది కేంద్ర అర్థిక మంత్రిత్వశాఖ. ఈ నెల 31వ తేదీ లోపు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని ఇప్పటికే అదేశాలను జారీ చేసిన కేంద్ర అర్థిక శాఖ.. ఈ నేపథ్యంలో పలు అనుమానాస్పద పాన్ కార్డులను పనిచేయకుండా చేసేపింది. ఇందుోల భాగంగా సుమారు 11.44 లక్షల కార్డులు ఇక పనిరాకుండా పోగా.. మరికొన్నింటిని పూర్తిగా డిలీట్ చేసేసింది.
ఒకవేళ మీ కార్డు యాక్టివ్ గా ఉందో లేక డీయాక్టివ్ అయిందో తెలుసుకోవాలంటే, ఆదాయపు పన్ను విభాగం ఇ- ఫైల్లింగ్ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి, 'Know Your Pan' అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, వివరాలు సబ్ మిట్ చేస్తే, మీ ఫోన్ నంబరుకు ఓ వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తరువాత, మీ పాన్ కార్డు డీ యాక్టివేట్ కాకుంటే ‘యాక్టివ్’ అన్న మెసేజ్ వస్తుంది. అది రాకుంటే, మీ పాన్ కార్డు డీయాక్టివేట్ అయినట్టు. ఒకవేళ డీ యాక్టివేట్ అయిన కార్డులను తిరిగి యాక్టివేట్ చేసుకునే విధానంపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. వారు మరో కార్డు తీసుకోవాలా? లేక ఆధార్ అనుసంధానం చేసుకుంటే సరిపోతుందా? అన్న విషయాన్ని కేంద్రం స్పష్టం చేయాల్సి వుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more