lunar eclipse Effects On Zodiac Signs చంద్రగ్రహణనాన్ని ఈ రాశుల వీక్షిస్తే దుష్ర్ఫభావం

August 2017 chandra grahan effects on zodiac signs

Chandra Grahan, lunar eclipse, August 2017 lunar eclipse, Chandra Grahan Effects, lunar eclipse effects, lunar eclipse effects on zodiac signs. chandr grahan effects on Zodiac Signs, lunar eclipse zodiac signs, chandra grahan zodaic signs, penumbral lunar eclipse

lunar eclipse we shall witness on 7-8 August 2017 is described penumbral lunar eclipse and shall not be seen prominently, which is important from astrilogical point of view, therefore this Chandra Grahan shall not have pronounced effects on any of the zodiac signs.

చంద్రగ్రహణనాన్ని ఈ రాశుల వీక్షిస్తే దుష్ర్ఫభావం

Posted: 08/07/2017 01:40 PM IST
August 2017 chandra grahan effects on zodiac signs

ఇవాళ రాత్రి ఏర్పడనున్న చంద్ర గ్రహణంపై ప్రజల్లో ఇప్పటికే రకరకాల సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రహణం రాత్రి సమయంలో సంభవించునన్న నేపథ్యంలో దీనిని ఏయే రాశాలు వారు వీక్షించవచ్చు అన్న సందేహాలు ఓ వైపు వ్యక్తమవుతున్న తరుణంలోనే మరోవైపు ఈ గ్రహణం మూలంగా ఏయే రాశుల వారిపై దుష్ప్రభావం చూపుతుందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయమై జ్యోతిష్య, వేద పండితులు ప్రజలకు పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు.

ఈ గ్రహణ ప్రభావం ఏ రాశులపై కూడా అంతగా వుండదని అందుకు కారణాన్ని కూడా కొందరు పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ గ్రహణం అంతగా వీక్షించడానికి వీలుకానిదని, అయితే ఇది జోతిష్య శాస్త్రంలో అత్యితక కిలకమైన కోణమని చెబుతున్నారు. దీంతో ప్రజలు చంద్రగ్రహణం తమ రాశులపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుందోనన్న అందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నారు. ఈ గ్రహణంతో ఏ రాశులవారికి ఎలాంటి చెడు ఫలితాలు వుండబోవని చెబుతున్నారు.

కాగా, కొందరు జోతిష్య పండితులు మాత్రం అందుకు భిన్నంగా చంద్రగ్రహణం ప్రభావం తప్పకుండా రాశులపై వుంటుందని పేర్కోంటున్నారు. అయితే ఈ చంద్రగ్రహణం ప్రభావంతో అత్యధికులకు మేలు కలుగుతుందని, ఇదే సమయంలో కొంతమందిపై దుష్ప్రభావాన్ని కూడా చూపుతుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, గర్బిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. గ్రహణ మోక్షం అర్థరాత్రి తరువాత ఉంది కాబట్టి, సాధ్యమైన వారు రాత్రిపూట విడుపు స్నానం చేయాలని సూచిస్తున్నారు. అలా కానీ పక్షంలో మరుసటి రోజు ఉదయం విడుపు స్నాశం చేసిన తరువాత ఇంటిని శుధ్ది చేసుకుని ఆ తరువాతే అల్పాహారాన్ని తీసుకోవాలని, ఇక రాత్రి సమయంలో విడుపు స్నానం చేసిన వారుకు కూడా మరుసటి రోజు వరకు అహారాన్ని తీసుకోరాదని సూచిస్తున్నారు.

సాధ్యమైనంత వరకూ ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపుగా ఆహారం తీసుకుని, మంగళవారం ఉదయం వరకూ ఎలాంటి ఘణాహారం కానీ ధ్రవ్యహారం కానీ తీసుకోకుంటేనే మంచిదని జోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇక చంద్ర గ్రహణం మకర రాశీలోని శ్రవణా నక్షత్రంలో సంభవిస్తున్న కారణంగా ఆ రాశీకాబట్టి, జన్మ, నామ నక్షత్రాలు 'శ్రవణం' అయితే వారు చూడవద్దని సలహా ఇస్తున్నారు. ఇక రాశుల విషయానికి వస్తే, మిధున, తుల, మకర, కుంభ రాశుల వారికి గ్రహణం అధమ ఫలాన్ని ఇస్తుందని, వృషభ, కర్కాటక, కన్య, ధనూ రాశి వారికి మధ్యమ ఫలం దక్కుతుందని, మేష, సింహ, వృశ్చిక, మీన రాశుల వారికి శుభ ఫలాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles